ఇండస్ట్రీ ఏదైనా… బ్లాక్‌బస్టర్ ఇచ్చిన హీరోయిన్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోతుంది. అందులోనూ చిన్న సినిమాగా తెరకెక్కి విజయం అందుకుంటే ఇంకా వేగంగా స్టార్ అయిపోతారు. అలా ఏడేళ్ల క్రితం అలా మరాఠీ ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చింది రింకూ రాజగురు. ఇలా పేరుతో చెబితే తెలుసుకోవడం కష్టం కానీ… ‘సైరాట్’ హీరోయిన్ అంటే మాత్రం ఈజీగా చెప్పేయొచ్చు. ఆ హీరోయిన్ ఇప్పుడు టాలీవుడ్లోకి వస్తోంది. అక్కడ సినిమా చేసిన ఏడేళ్ల తర్వాత ఇక్కడకు వస్తోందన్నమాట.
ఏడేళ్ల క్రితం వచ్చిన ‘సైరాట్’ (Sairat) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనాలి. ప్రేమ కథల్లో శాడ్ ఎండింగ్ కథలు చాలానే వచ్చినా.. ఆ సినిమా ఇచ్చిన ఎమోషనల్ కనెక్ట్ ఇంకేదీ ఇవ్వలేదు అని చెప్పాలి. దానికి కారణం చాలా నేచురల్‌గా కనిపించి రింకూ రాజగురు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ నాయిక తెలుగులోకి వస్తోంది. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్‌లో రాకేష్ వర్రే నిర్మించబోయే సినిమాలో రింకూ రాజగురు నటిస్తోందని సమాచారం. ఆ సినిమాలో హీరో కూడా ఆయనే.
విశ్వక్సేన్ డెబ్యూ మూవీ ‘వెల్లిపోమాకే’ను హ్యాండిల్ చేసిన… యాకూబ్ అలీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారట. ఇక రింకూ రాజగరు సంగతి చూస్తే… 16 ఏళ్ల వయసులోనే సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. నాగరాజ్ మంజులే దర్శకత్వం విహించిన ఆ సినిమా ఏకంగా రూ. 100 కోట్లు వసూలు చేసింది. అంతేకాదు ఆ సినిమాతో జాతీయ అవార్డును అందుకుంది. ‘సైరాట్’ దర్శకుడు నాగరాజుది, రింకూ రాజగురుది ఒకే ఊరట. ఆ పరిచయంతోనే సినిమాలోకి వచ్చిందట. అంతేకాదు ఆ సినిమా పనులు మొదలైనప్పుడు రింకూ ఎనిమిదో తరగతి చదువుతోందట.
ఆ సినిమాతో రింకూ కొన్ని సినిమాలు చేసినా పెద్దగా విజయం అందుకోలేదు. ఈ క్రమంలో రింకూ రాజగరు వెబ్ సిరీస్‌ల్లో కూడా నటించింది. ‘హండ్రెడ్’ అనే వెబ్ సిరీస్‌లో రింకూ నటనకు మంచి పేరొచ్చింది కూడా. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారు అంటుంటారు. అయితే రింకూ మాత్రం వెటర్నరీ డాక్టర్ అవ్వాలనుకుంది. అయితే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేఅఆను అని చెప్పింది.
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!