Varun Tej: వరుణ్ పైనే ఆశలు పెట్టుకున్న ‘ఏజెంట్’ హీరోయిన్!

  • May 6, 2023 / 03:24 PM IST

‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు’ ..అనేదానికి ‘ఏజెంట్’ హీరోయిన్ సాక్షి వైద్య బెస్ట్ ఎగ్జామ్పుల్ అని చెప్పొచ్చు. ఫిజియోధెరపిస్ట్ అయిన ఈమె లక్కు కొద్దీ హీరోయిన్ అయిపోయినట్టు ఆనందంగా చెప్పుకొచ్చింది. కానీ సక్సెస్ రాకపోతే ఇక్కడ రాణించడం కష్టమని తెలుసుకోలేకపోయింది. అయితే సినీ పరిశ్రమ మాత్రం ఈ భామ పెద్ద హీరోయిన్ అయిపోతుంది అని భావించింది.స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సినిమా కాబట్టి.. ‘ఏజెంట్’ తప్పకుండా హిట్ అవుతుంది ఈమె బిజీ హీరోయిన్ అయిపోతుంది అని ఇండస్ట్రీలో చాలా మంది భావించారు.

కానీ ‘ఏజెంట్’ ఫలితం ఈమెను అయోమయంలోకి పడేసినట్టైంది. సాక్షి లుక్స్ బాగుంటాయి. అమ్మాయి మంచి హైట్ ఉంటుంది. ఆకర్షించే రూపం కూడా ఈమె సొంతం..! అందాలు వడ్డించడానికి కూడా వెనుకాడడు. అందుకే ఈమెకు వెంటనే వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గాండీవధారి అర్జున’ సినిమాలో కూడా ఛాన్స్ దక్కింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ‘విరూపాక్ష’ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాత. ప్రవీణ్ సత్తార్ మంచి టాలెంటెడ్ డైరెక్టర్.

వరుణ్ తేజ్ (Varun Tej)  ప్రామిసింగ్ హీరో.. పైగా అతని స్టోరీ సెలక్షన్ కూడా బాగుంటుంది. ఇక బీవీఎస్ఎన్ ప్రసాద్ మినిమమ్ గ్యారెంటీ అనే సినిమాలు నిర్మిస్తుంటారు అనే పేరుంది. సో సాక్షికి రెండో సినిమా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత ఆమె అదృష్టం పై ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus