Salaar: సలార్ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఇదేనా?

  • July 13, 2023 / 09:23 PM IST

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవనే సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన సలార్ టీజర్ సంచలనాలను సృష్టిస్తూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే సలార్ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్ వచ్చింది. రాబోయే పది రోజుల్లో సలార్ ఫస్ట్ సింగిల్ విడుదలయ్యేలా మేకర్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.

సలార్ సాంగ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉండనున్నాయని రవి బస్రూర్ ఈ సినిమా మ్యూజిక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని భోగట్టా. కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల సక్సెస్ లో మ్యూజిక్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సలార్ సినిమాలో కూడా మ్యూజిక్ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండనుందని తెలుస్తోంది. సలార్ సినిమా పార్ట్1 కోసం 300 కోట్ల రూపాయలు ఖర్చు కాగా ఈ సినిమా థియేట్రికల్ హక్కుల ద్వారా మేకర్స్ కు ఏకంగా 500 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది.

సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రభాస్, శృతి హాసన్ కాంబినేషన్ బాక్సాఫీస్ ను షేక్ చేసేలా ఉండనుందని భోగట్టా. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది. సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంటుందని సమాచారం అందుతోంది.

సలార్ (Salaar) కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లో ఎక్కువ మొత్తం బిజినెస్ చేసిన సినిమాగా సలార్ నిలిచే ఛాన్స్ అయితే ఉంది. సలార్ సినిమా రిజల్ట్ విషయంలో ప్రశాంత్ నీల్ పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారని తెలుస్తోంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus