Salaar Release Trailer: ‘సలార్’ ఫైనల్ పంచ్ ఎలా ఉందంటే?

  • December 18, 2023 / 05:53 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. బాహుబలి(సిరీస్) హీరో, కేజీఎఫ్(సిరీస్) దర్శకుడి కలయికలో రూపొందుతున్న సినిమా కావడంతో ‘సలార్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2 పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో డిసెంబర్ 22న తెలుగు, కన్నడంతో పాటు హిందీ, తమిళ,మలయాళ భాషల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

‘హోంబలే ఫిలింస్’ బ్యానర్ పై విజయ్ కిరంగధూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే టీజర్,ట్రైలర్, ఒక పాట రిలీజ్ అవ్వడం జరిగింది. ఇవి సో సో గానే అనిపించాయి. అయితే సెకండ్ ట్రైలర్ కూడా ఉంటుందని చిత్ర బృందం ఇది వరకే ప్రకటించింది. వాస్తవానికి నిన్న ఆదివారం రోజునే రిలీజ్ చేస్తామని చెప్పినప్పటికీ ఎందుకో చేయలేదు. దీంతో ఈరోజు ఉదయం 10: 42 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చింది.

‘సలార్’ (Salaar) యూనిట్. మళ్ళీ ఏమైందో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్టు మళ్ళీ టైం మార్చారు. మొత్తానికి రెండో ట్రైలర్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన టీజర్ , ట్రైలర్.. లో ప్రభాస్ స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉంటుంది. అయితే ఈ రిలీజ్ ట్రైలర్ లలో ఎక్కువ శాతం ప్రభాసే కనిపించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో ప్రభాస్ గ్రేస్ నెక్స్ట్ లెవల్లో ఉంది అని చెప్పాలి. ప్రభాస్ కి ఉన్న యాక్షన్ ఇమేజ్, స్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఎలివేషన్స్ ఉండబోతున్న ఈ రిలీజ్ ట్రైలర్ చెప్పింది.

‘ ఖాన్సార్ ఎరుపెక్కాలా ‘ అంటూ ప్రభాస్ పలికే డైలాగ్ మంచి హై ఇచ్చింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా ఎందుకు మారతారు, అది ఖాన్సార్ ప్రజల భవిష్యత్తుని ఎలా మార్చింది అనే సస్పెన్స్ కి ఈ ట్రైలర్ తెరలేపింది అని చెప్పాలి. మొత్తంగా సలార్ రిలీజ్ ట్రైలర్ ప్రభాస్ అభిమానులకు, మాస్ ప్రేక్షకులకి నచ్చే విధంగా ఉంది అని చెప్పొచ్చు. మీరు కూడా ఒకసారి చూడండి:

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus