Salaar: సలార్ మూవీ ఖాతాలో మరో రేర్ రికార్డ్.. కానీ?
January 23, 2024 / 03:53 PM IST
|Follow Us
ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ మూవీ తెరకెక్కగా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వేదికగా తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. సలార్ తెలుగు వెర్షన్ ట్రెండింగ్ లో నంబర్1 గా నిలవడం గమనార్హం. తమిళ వెర్షన్ రెండో స్థానంలో నిలవగా కన్నడ వెర్షన్ ఐదో స్థానంలో మలయాళం వెర్షన్ ఏడో స్థానంలో నిలిచాయి. తెలుగులో నంబర్ వన్ స్థానంలో నిలిచిన ఈ మూవీ ఇతర భాషల్లో మాత్రం టాప్ లో నిలవకపోవడం గమనార్హం.
థియేటర్లలో ఊహించని స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న (Salaar) ఈ సినిమా ఓటీటీలో ఆలస్యంగా స్ట్రీమింగ్ అయ్యి ఉంటే సలార్ కలెక్షన్లు మరింత పెరిగేవి. నెట్ ఫ్లిక్స్ ఎక్కువ సంఖ్యలో సినిమాల హక్కులను కొనుగోలు చేస్తుండగా ఆ సినిమాలు తక్కువ సమయంలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా ఒప్పందాలను కుదుర్చుకుందని సమాచారం అందుతోంది. పెద్ద సినిమాలకు నెట్ ఫ్లిక్స్ ఊహించని స్థాయిలో ఆఫర్ చేస్తోంది.
నెట్ ఫ్లిక్స్ ఇతర ఓటీటీలకు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు భారీ బడ్జెట్ సినిమాలకు ఎక్కువ మొత్తంలో ఆఫర్ చేస్తుండటం గమనార్హం. రాబోయే రోజుల్లో నెట్ ఫ్లిక్స్ కు సబ్ స్క్రైబర్లు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇతర ఓటీటీలు ఈ ఓటీటీకి కనీస పోటీని కూడా ఇవ్వలేకపోతుండటం గమనార్హం. నెట్ ఫ్లిక్స్ పండగ పేరుతో ఇప్పటికే ఈ ఓటీటీ పలు క్రేజీ సినిమాలను ప్రకటించింది.
నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఫీజు కూడా తక్కువగానే ఉండటంతో ఎక్కువమంది ఈ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు పృథ్వీరాజ్ సుకుమారన్ లూసిఫర్2 ప్రాజెక్ట్ తో బిజీ అవుతుండటంతో పాటు కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ వల్ల సలార్2 ఆలస్యం కానుందని వార్తలు వస్తున్నాయి. దేవర, పుష్ప2, గుంటూరు కారం సినిమాల డిజిటల్ హక్కులు సైతం నెట్ ఫ్లిక్స్ సొంతం కావడం గమనార్హం.