కొన్ని పాత్రలకు కొందరు వద్దనుకున్నా సెట్ అయిపోతుంటారు. ఆ విధంగా అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రొజెక్ట్ “మహాభారతం”లో తొలుత అమీర్ స్వయంగా శ్రీకృష్ణుడిగా నటిద్దామనుకొన్నాడు. కానీ.. పలు సంఘాలు, మత పెద్దలు అంగీకరించకపోవడంతో విడుదల సమయంలో మళ్ళీ ఎందుకొచ్చిన టెన్షన్ అనుకున్నాడో ఏమో కానీ ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడి పాత్రని తన స్నేహితుడు సల్మాన్ ఖాన్ తో పోషింపజేయాలని ఆలోచనలో ఉన్నాడట. ఇటీవల సల్మాన్ తో ఇదే విషయం చెప్పగా.. సరేనన్నాడట సల్మాన్ ఖాన్.
దాంతో 2020లో ప్రారంభమవ్వబోయే ఈ ప్రొజెక్ట్ లో సల్మాన్ ఖాన్ శ్రీకృష్ణపరమాత్ముడిగా నటించడం కన్ఫర్మ్ అయినట్లే. ఇక్కడ విశేషం ఏంటంటే.. సల్మాన్ ఖాన్ కి అయిదేళ్ళ జైలు శిక్ష పడిన తర్వాత ప్రస్తుతం బెయిల్ తీసుకొని తాను ఒప్పుకొన్నా ప్రొజెక్ట్స్ ను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. సో, ఒక రెండేళ్లపాటు శ్రీకృష్ణ జన్మస్థానంలో సేద తీరాక సల్మాన్ అదే శ్రీకృష్ణుడి పాత్ర పోషించనుండడం ఇక్కడ విశేషం.