Salman Khan: ఇండస్ట్రీ గురించి సల్మాన్ ఆసక్తికర కామెంట్స్.. అర్థం ఇదేనా?
April 7, 2023 / 07:58 PM IST
|Follow Us
బాలీవుడ్ పని ఇక అయిపోయింది.. సౌత్ సినిమాలు దేశంలో టాప్ అంటూ.. చాలామంది చంకలు గుద్దుకుంటున్నారు. పాన్ ఇండియా సినిమాలు వరుగా విజయాలు సాధిస్తుండటం, మన హీరోలకు విదేశాల్లో కూడా పేరు వస్తుండటంతో ‘ప్చ్.. బాలీవుడ్’ అనే మాట వినిపిస్తోంది. అయితే బాలీవుడ్ సామ్రాజ్యం ఒక సినిమానో లేక నాలుగైదు సినిమాలతో సిద్ధం కాలేదు. అది వేల సినిమాల కష్టం. దీనికి అంత ఈజీగా వదులుకోం అని అంటున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ కూడా ఇదే మాట చెప్పాడు.
హిందీ పరిశ్రమలో ఏళ్ల తరబడి నటిస్తున్నాం. అంత సులభంగా దీన్ని వదులుకోం. బాలీవుడ్ యువనటులు మంచివారు, ప్రతిభావంతులు, కష్టపడి పనిచేస్తారు. అలాగని సీనియర్లమైన మేం కూడా ఎక్కడా తగ్గేది లేదు. వాళ్లకి సవాల్ విసురుతూనే ఉంటాం అని అన్నాడు సల్మాన్ ఖాన్. ఓ అవార్డు ఫంక్షన్లో భాగంగా మేరకు కామెంట్స్ చేశాడు సల్మాన్. నేను, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ అంత తేలికగ్గా చిత్రపరిశ్రమను వదులుకోం అని కూడా చెప్పాడు.
హిందీ సినిమాలు సరిగ్గా పనిచేయడం లేదని, అందుకే విజయాలు దక్కడం లేదని చాలా కాలంగానే వింటూనే ఉన్నాను. అయినా సరైన సినిమాలు తీయకపోతే.. ప్రేక్షకులకు ఎలా నచ్చుతాయి అని ప్రశ్నించాడు సల్మాన్. ఈ విషయంలో బాలీవుడ్ మరింత జాగ్రత్తగా పని చేసి.. తిరిగి పాత బాలీవుడ్‌ను చూపించాలి అనే అర్థంలో సల్మాన్ ఖాన్ మాట్లాడాడు. దీంతో బాలీవుడ్ జనాలు మళ్లీ సీరియస్‌గా కృష్టి చేస్తున్నట్లు తెలుస్తోంది. షారుఖ్ ‘పఠాన్’ విజయం వారికి తిరిగి పాత కిక్ రుచి చూపించింది అనొచ్చు.
బాలీవుడ్ బాగా డౌన్లో ఉంది అనుకుంటుంగా వచ్చిన ‘పఠాన్’ సినిమా వెయ్యి కోట్ల రూపాయలకుపైగా వసూళ్లతో అదరగొట్టింది. సరైన సినిమా తీస్తే.. చూడటానికి మేమెప్పుడూ సిద్ధమే అని బాలీవుడ్ ప్రేక్షకులు చెప్పారు. దీంతో ఇప్పుడు నెక్స్ట్ బాధ్యత ‘కిసీ కా భాయ్…కిసీ కీ జాన్’తో వస్తున్న సల్మాన్ మీద పడింది. మరి భాయ్ ఏం చేస్తాడో చూడాలి.