Radhe Movie: సల్మాన్ ఖాన్ అతి చిన్న సినిమా

  • May 4, 2021 / 09:54 AM IST

బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు అందుకోవడంలో ఎంత స్పీడ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా మొదటి వారంలోనే పెట్టిన బడ్జెట్ వెనక్కి వచ్చేలా రిలీజ్ చేస్తుంటాడు. ఇక మొదటిసారి ఓటీటీ, థియేటర్స్ లో ఒకేసారి విడుదలవుతున్న రాధే ఎలాంటి వసూళ్లను అందుకుంటుందనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన రాధే సినిమా మే 13న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

అయితే సినిమాకు సంబంధించిన సెన్సార్ వర్క్ పూర్తయ్యింది. సినిమా రన్ టైమ్ 1గంట 54నిమిషాలని తెలుస్తోంది. సల్మాన్ ఇన్నేళ్ల కెరీర్ లోనే రెండు గంటల కంటే తక్కువ నిడివితో ఏ సినిమా కూడా రిలీజ్ కాలేదు. పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అభిమానుల అంచనాలకు తగ్గట్టుకుగానే ఉంటుందని ప్రమోషన్ డోస్ పెంచుతున్నారు. ఇక సినిమాను ప్రముఖ జీ స్టూడియోస్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ జీ ఫ్లెక్స్ లో విడుదల చేస్తున్నారు.

పే పర్ వ్యూ ఫార్మాట్ లో 249రూపాయలకు రేటు ఫిక్స్ చేశారు. మొదటిసారి ఈ ఫార్మాట్ లో రిలీజ్ అవుతున్న చిత్రం కావడంతో సినిమాకు కలెక్షన్స్ ఏ స్థాయిలో వస్తాయో చూడాలని సినీ ప్రముఖులంతా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ సినిమా మంచి వసూళ్ళను అందుకుంటే ఇదే తరహాలో మరికొన్ని సినిమాలను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus