Salman Khan,Hrithik Roshan: హృతిక్ తో అలియా భట్ రొమాన్స్!

  • July 13, 2021 / 12:07 PM IST

‘ఖామోషి’ సినిమాతో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి బిగ్ బ్రేక్ ఇచ్చారు స్టార్ హీరో సల్మాన్ ఖాన్. ఈ సినిమా వచ్చిన చాలా ఏళ్ల తరువాత సంజయ్ లీలా భన్సాలీ.. సల్మాన్ తో మరో సినిమా అనౌన్స్ చేశారు. అదే ‘ఇన్షాఅల్లా’. ఇందులో సల్మాన్ కి జోడీగా అలియా భట్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ కాంబినేషన్ సెట్ అయిందని తెలియగానే ఫ్యాన్స్ లో ఉత్సాహం మొదలైంది. అయితే కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి సల్మాన్ తప్పుకున్నారు.

అందులో సంజయ్ ముందుగా అలియా భట్ ప్రధాన పాత్రలో ‘గంగూభాయ్ కతియావాడి’ సినిమాను పూర్తి చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత ఓటీటీ కోసం ‘హీరా మండి’ అనే ప్రాజెక్ట్ ను చేపట్టారు సంజయ్ లీలా భన్సాలీ. అలానే ఇప్పుడు ‘ఇన్షాఅల్లా’ సినిమాను కూడా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. దీంతో సల్మాన్ స్థానంలో స్టార్ హీరో హృతిక్ రోషన్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

కథ ప్రకారం..హీరోయిన్ తనకంటే వయసులో పెద్దవాడైన వక్తిని ప్రేమలో పడుతుందట. ఆ తరువాత ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయనే కాన్సెప్ట్ తో సినిమాను రూపొందించనున్నారు. ఈ కథలో హృతిక్ సరసన అలియా పెర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని భావిస్తున్నారు దర్శకుడు సంజయ్. ‘గంగూభాయ్’ సినిమా రిలీజ్ అయ్యే సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వాలని అనుకుంటున్నారట.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus