Samajavaragamana Collections: ‘సామజవరగమన’ 10 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

  • July 10, 2023 / 09:24 AM IST

‘అర్జున ఫల్గుణ’ ‘భళా తందనాన’ ‘అల్లూరి’ వంటి వరుస ప్లాపులు తర్వాత శ్రీవిష్ణు నుండి వచ్చిన చిత్రం ‘సామజవరగమన’. ‘వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూన్ 29న రిలీజ్ అయ్యింది. మొదటి సినిమాతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ సూపర్ గా కలెక్ట్ చేస్తుంది అని చెప్పాలి.

ఒకసారి ‘సామజవరగమన’ 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 2.95 cr
సీడెడ్ 0.86 cr
ఉత్తరాంధ్ర 1.0 cr
ఈస్ట్ 0.53 cr
వెస్ట్ 0.37 cr
గుంటూరు 0.47 cr
కృష్ణా 0.48 cr
నెల్లూరు 0.27 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 6.93 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.38 cr
ఓవర్సీస్ 1.49 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 9.8 cr (షేర్)

‘సామజవరగమన’ (Samajavaragamana) చిత్రానికి రూ.3.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.9.8 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేయడమే కాకుండా రూ.5.6 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెండో వీకెండ్ ను కూడా ఈ మూవీ చాలా బాగా క్యాష్ చేసుకుంటుంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus