హీరోయిన్స్ కి కష్టమేముంది.. ఎక్కడికి పోయిన కారవ్యాన్ ఉంటుంది. కాస్త కూడా ఎండా తగలకుండా గొడుగు పట్టే పనోళ్ళు ఉంటారు. చెమట పట్టకుండా చూసుకునే ఫ్యాన్స్ ఉంటారని చాలామంది నమ్మకం. నమ్మకం వేరు.. నిజం వేరు. సమంత ఆ విషయాన్నీ ఈరోజు స్పష్టం చేసింది. సమంత స్టార్ హీరోయిన్ లో ఒకరు. చెమట పట్టని పాత్రలను ఎంపిక చేసుకోవచ్చు. కానీ కష్ట పడకుండా ఎంతో దూరం వెళ్లలేమని ఆమెకు తెలుసు అందుకే. ఇప్పటికీ శ్రమిస్తూనే ఉంది. కొన్ని రోజుల క్రితం రంగస్థలం సినిమా కోసం సమంత రాజమహేంద్రవరంలో మండుతున్న ఎండల్లో నటించింది. ఆ సమయంలో కళ్ళు తిరిగి కూడా పడిపోయింది.
ఇప్పుడు మరో సినిమా కోసం రాత్రిళ్లు వర్షంలో తడుస్తోంది. ప్రస్తుతం సమంత “సూపర్ డీలక్స్” అనే తమిళ చిత్రంలో విజయ్‌కి జోడీగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చెన్నైలోని టెన్సకి ప్రాంతంలో జరుగుతోంది. రాత్రి పూట వర్షంలో కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా సెట్స్‌లోని ఓ ఫొటోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటో పైన “రాజమహేంద్రవరంలో ఎండల్లో చిత్రీకరణలో పాల్గొని.. ఇప్పుడు టెన్సకిలో వర్షంలో తడుస్తున్నాను. దేవుడా.. నాతో ఎందుకు ఇలాంటి డర్టీ ఆటలు ఆడుతున్నావ్?” అంటూ ఏడుస్తున్న ఇమోజీలను యాడ్ చేసారు. దీన్ని బట్టి సమంత ఎంత కష్టపడుతుందో ఫ్యాన్స్ కి అర్ధమవుతోంది. ఆ సినిమాలు హిట్ అయితే ఈ కష్టం గాల్లో తేలిపోతుంది.