రవితేజ డిజాస్టర్ సినిమా కంటే కూడా పెద్ద ప్లాప్ అయ్యింది..!
April 24, 2020 / 07:41 PM IST
|Follow Us
తమిళంలో విజయ్, సేతుపతి, త్రిష .. ప్రధాన పాత్రలు పోషించిన ’96’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెన్త్ క్లాస్ బ్యాచ్ అంతా మళ్ళీ ‘గెట్ టు గెథర్’ అవ్వడం. దానికి విడిపోయిన ఇద్దరు ప్రేమికులైన హీరో, హీరోయిన్లు కూడా హాజరుకావడం… అటు తరువాత ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్టింగ్ లైన్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. గోవింద్ వసంత సంగీతం ఈ చిత్రానికి మరింత ప్లస్ అని చెప్పాలి.
అయితే అదే చిత్రాన్ని తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేస్తే వారానికే దుకాణం సర్దేసింది. సేమ్ డైరెక్టర్ తెలుగులో డైరెక్ట్ చేసాడు… శర్వానంద్, సమంత వంటి క్రేజీ నటులు నటించారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాత. అయినా సినిమా డిజాస్టర్ అయ్యింది. ఫిబ్రవరి వంటి డ్రై సీజన్ లో విడుదల కావడం.. అందులోనూ ’96’ ను చాలా మంది తెలుగు ప్రేక్షకులు చూసెయ్యడం వల్ల ‘జాను’ ని ఎవ్వరూ పట్టించుకోలేదని తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని ఇటీవల స్టార్ మా వారు టెలికాస్ట్ చెయ్యగా కేవలం 7.27 రేటింగ్ ను మాత్రమే నమోదు చేసింది.
ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంట్లోనే ఉంటున్నారు… అందులోనూ ‘స్టార్ మా’ వారు టెలికాస్ట్ చేసే సినిమాలకి ఎక్కువ టి.ఆర్.పి వస్తుంది అనే బలమైన నమ్మకం ఉన్నప్పటికీ .. ఇంత దారుణమైన రేటింగ్ రావడం గమనించ దగ్గ విషయం. ఆఖరికి రవితేజ హీరోగా వచ్చిన డిజాస్టర్ ‘నేల టికెట్’ ఆరో సారి జెమినీ టీవీ లో టెలికాస్ట్ చేస్తే.. డానికి 6.97 రేటింగ్ వచ్చింది. చెప్పాలంటే అది బెటర్ రేటింగ్ అనే చెప్పాలి. కాబట్టి బుల్లితెర పై కూడా ‘జాను’ డిజాస్టర్ అయ్యింది. గత 3 ఏళ్లలో సమంత కి పెద్ద ప్లాప్ అంటే ‘జాను’ అనే చెప్పాలి.