సమంత, చైతు పూజలు దేనికోసం..?

  • September 26, 2016 / 09:17 AM IST

ప్రేమ పావురాల్లా షికారు చేసిన నాగచైతన్య, సమంత పెళ్లి పీటలెక్కనున్నట్టు అక్కినేని వారు అధికారిక కబురందించిన సంగతి తెలిసిందే. అక్కడితో ఈ వ్యవహారం చక్కెర్లు కొట్టడం మానేస్తుందనుకుంటే అసలు కథ ఇప్పుడే మొదలైనట్టు రోజుకో ఫొటో నెట్టింట్లో ప్రత్యక్షమవుతూ కొత్త చర్చకు దారి తీస్తుంది. మొన్నామధ్య అత్త అమలతో సమంత ఉన్న ఫొటో రాగా తాజాగా చైతూ, సమంత పూజలు చేస్తున్న ఫొటోలు దర్శనమిచ్చాయి. వీటిలో కింగ్ నాగ్ ఉండటం విశేషం.

ఇప్పటికే ఈ తతంగంపై ఎవరికి తోచిన కథనాలు వారు సిద్ధం చేశారు. జాతక దోషాల గురించి పూజలు చేశారని కొందరు గుసగుసలు మొదలెడితే మరికొందరు మత మార్పిడి వ్యవాహారమని తేల్చి చెప్పేస్తున్నారు. జన్మతః క్రిష్టియన్ అయిన సమంత హిందువైన చైతన్యని వివాహమాడనుంది. అందుకనే ఈ పూజ కార్యక్రమాలని జోరుగా చర్చలు జరుగుతున్నాయి. పైగా రెండు మతాల పద్ధతుల్లో సమంత తమ పెళ్లి జరగాలని షరతు విధించనుంది మరో పుకారు. వీటిల్లో నిజమెంతన్నది అటుంచితే.. పెళ్లి విషయంలో సమంత తన తల్లినే అనుసరిస్తునుంది. సమంత తల్లి తమిళనాడుకి చెందినవారు కాగా ఆమె తెలుగు వాడితో జీవితం పంచుకున్నారు. తమిళియన్ చెప్పుకునే సమంత కూడా ఇప్పుడు తెలుగు కుర్రాడితోనే తాళి కట్టించుకోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus