Samantha: సమంత ఎమోషనల్ కామెంట్స్ వైరల్.. ఆ రమార్స్ పై క్లారిటీ..!
October 8, 2021 / 08:17 PM IST
|Follow Us
సమంత – నాగ చైతన్య… విడాకుల వ్యవహారం పై రోజుకో కథనాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో ఈమె హద్దులు మించి ఇంటిమేట్ సీన్స్ లో నటించడం…వల్లనే వీరి విడాకులకు దారి తీసిందని… ఇంకోసారి అయితే ప్రీతమ్ జుకల్కర్ అనే కాస్ట్యూమ్ డిజైనర్ తో సామ్ ప్రేమాయణం నడపడం వలన చైతన్య తో విడాకులు తీసుకుందని… ఇలా రకరకాల కథనాలు వినిపించాయి. విడాకుల తర్వాత ట్విట్టర్ లో సామ్ కనిపించలేదు.
తన ఇన్స్టా లో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ వచ్చింది. అయితే ఇలాంటి వార్తల పై తాజాగా సామ్ స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. సమంత ఈ వార్తల పై స్పందిస్తూ…”నా పై మీరు చూపిస్తున్న జాలి, కరుణకి కృతజ్ఞతలు. అయితే, కొందరు నన్ను పర్సనల్ గా టార్గెట్ చేస్తూ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. నాకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లల్ని వద్దనుకున్నానని, అబార్షన్ చేయించుకున్నానని,
నేను అవకాశవాదినని ఎవరికి వారు తమకు నచ్చింది, తోచింది స్ప్రెడ్ చేసుకుంటున్నారు. విడాకులు తీసుకోవడం అనేది ఎంతో బాధతోకూడుకున్న వ్యవహారం. ఈ బాధ నుండీ నేను బయటపడడానికి నాకు టైం పడుతుంది. పర్సనల్ గా నాపై దాడి చేయడం చాలా ఘోరమైన విషయం. మీరనుకునే విధంగా నేను ఎన్నడూ చేయను. మీరు నన్ను ఎంత బాధపెట్టినా నేను కృంగిపోను, పడిపోను” అంటూ చెప్పుకొచ్చింది.