Samantha: స్విమ్మింగ్ పూల్ లో సమంత గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • August 31, 2023 / 11:08 PM IST

సమంత ప్రస్తుతం విదేశాల్లో ఉంది.అమెరికా వెళ్తున్నట్టు ఎయిర్ పోర్ట్ లో తీసిన ఫోటోలు మొన్నామధ్య వైరల్ అయ్యాయి. కొన్నాళ్లుగా ఆమె మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్నందున చికిత్స నిమిత్తం ఆమె విదేశాలకి వెళ్ళింది అని అంతా అనుకున్నారు. కానీ ఆగస్టు 20న అక్కడ నిర్వహించిన ‘ఇండియా డే పరేడ్’ కార్యక్రమంలో పాల్గొంటూ కనిపించింది కాబట్టి అది వట్టి అపోహే అని అంతా భావించారు. కొన్నాళ్లుగా ఆమె అక్కడే ఉంది. ఓవర్సీస్ లో పలు చోట్ల ఆమె ‘ఖుషి’ సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నట్టు టాక్ నడిచింది.

అక్కడ జరిగిన ఓ ఈవెంట్ లో కూడా ఈమె పాల్గొంది. ఈ క్రమంలో ఆ ఒక్క ఈవెంట్ కోసం సమంతకి అక్షరాల రూ.30 లక్షలు చెల్లించినట్టు కూడా ప్రచారం జరిగింది. సమంతకి ఓవర్సీస్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే నిర్మాతలు కూడా ఆ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపి ఉండొచ్చు. ఇదిలా ఉండగా.. సమంత అక్కడ బాగా రిలాక్స్ అవుతున్నట్టు కూడా కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ వస్తోంది.

తాజాగా ఆమె స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ తీసుకున్న ఫోటోలను, వీడియోలను షేర్ చేసింది. ‘మీకు నచ్చింది ఏదైనా సరే చేసేయండి. మీకు నచ్చిన మార్గంలో పయనించండి. జీవితంలో ప్రతీదీ కూడా ఓ ఎక్స్పీరియన్స్. ధైర్యంగా ముందడుగు వేయడం ముఖ్యం’ అంటూ ఆమె కొన్ని కొటేషన్స్ కూడా రాసుకొచ్చినట్టు స్పష్టమవుతుంది. సమంత స్విమ్మింగ్ పూల్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

 

 

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus