Naga Chaitanya, Samantha: మైండ్ బ్లాంక్.. సమంత విడాకులపై తండ్రి రియాక్షన్!
October 5, 2021 / 12:12 PM IST
|Follow Us
మొన్నటి వరకు టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్స్ లో ఒకరైన సమంత నాగచైతన్య రీసెంట్ గా వారి వైవాహిక జీవితానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. అక్కినేని అభిమానులకు మాత్రమే కాకుండా అందరిని ఈ విషయం షాక్ కు గురి చేసింది. నాగార్జున కూడా గుండె బరువుతోనే బాధగా స్పందించిన విషయం తెలిసిందే. ఆ ట్వీట్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కూడా కూడా వివరణ ఇచ్చిన విధానం హాట్ టాపిక్ గా మారింది.
సమంత నాగ చైతన్య పెళ్లి చేసుకుంటామని చెప్పినప్పుడు అందరికంటే ఎక్కువగా సంతోషించింది ఆయనే. వారి పెళ్లిలో జోసెఫ్ ప్రభు ఎంతో సంతోషంగా కనిపించినట్లు సమంత కూడా చాలాసార్లు వివరణ ఇచ్చారు. అయితే కూతురు అల్లుడు విడకుల విషయం తెలియగానే ఆయన ఒక్కసారిగా షాక్ అయినట్లు తెలుస్తోంది. తెలియగానే నా మైండ్ బ్లాంక్ అయ్యిందని సోషల్ మీడియా ద్వారా జోసెఫ్ ప్రభు వివరణ ఇచ్చారు. మైండ్ శూన్యంగా మారిపోయిందని ఆయన ఇచ్చిన వివరణ అందరిలో అనేక రకాల ఆలోచనలను కలుగజేస్తోంది.
ఏదేమైనా సమంత కుటుంబ సభ్యులు వారి ఇద్దరిని కలిపేందుకు చాలానే ప్రయత్నం చేసినప్పటికీ చర్చలు సఫలం కాలేదు. ఇక ప్రస్తుతం సమంత చెన్నైలో షూటింగ్ లో బిజీగా వర్క్ చేసుకుంటోంది. మరోవైపు నాగ చైతన్య ఎప్పటిలానే ప్రైవేసి మెయింటైన్ చేస్తూ సినిమాలతో బిజీ అవుతున్నాడు.