సమంత కొత్త ప్రయోగం… వర్కౌట్ అవుతుందా?

  • August 16, 2019 / 03:42 PM IST

నాగ చైతన్య తో పెళ్ళైన తర్వాత సమంత క్రేజ్ డబుల్ అయ్యిందనే చెప్పాలి. అవును ఇది నిజం.. పెళ్ళికి ముందు గ్లామరస్.. పాత్రలు అలాగే పెద్ద హీరోల సినిమాల్లో లీడ్ హీరోయిన్ గా నటిస్తూ వచ్చింది సమంత. కానీ అక్కినేని వారి ఇంటి కోడలైన తరువాత కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ వరుస విజయాల్ని సొంతం చేసుకుంటుంది. గతేడాది ‘రంగస్థలం’ ‘మహానటి’ ‘అభిమన్యుడు’ వంటి చిత్రాలలో సమంత నటనకి అద్భుతమైన స్పందన లభించింది. ఆ చిత్రాలు పెద్ద హిట్లయ్యాయి కూడా. ఇక ఈ యేడాది ఆమె నటించిన ‘మజిలీ’ ‘సూపర్ డీలక్స్’ ‘ఓ బేబి’ చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.

ఇక తాజాగా సమంత.. కియారా బాటలో నడవడానికి రెడీ అవుతుందని వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే సమంత వెబ్ సిరీస్ ల వైపు అడుగులు వేస్తుందట. ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్లు.. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన కియారా అద్వానీ ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీంతో అటుతరువాత ఆమెకు వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇప్పుడు అదే రూట్లో సమంత కూడా నడుస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగు,హిందీ, తమిళంలో భాషల్లో తెరకెక్కుతున్న ఓ వెబ్ సిరీస్ లో సమంత ప్రధాన పాత్ర పోషిస్తుందట. ఓ ప్రముఖ దర్శకుడు ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ వెబ్ సిరీస్ కోసం సమంత కూడా గట్టిగానే పారితోషికం అందుకుంటుందని టాక్ వినిపిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus