Samantha: విడాకుల తర్వాత కనుమరుగైపోనున్న సమంత… కారణం అదే..!
October 5, 2021 / 03:31 PM IST
|Follow Us
సమంత- నాగ చైతన్య- విడాకులు… గత మూడు నాలుగు రోజులుగా ఎక్కడ చూసినా ఈ విషయం పైనే చర్చ. మొన్నటివరకు చట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట సడెన్ గా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించడంతో అభిమానులు ఒకింత నిరాశకు గురయ్యారనే చెప్పాలి. అయితే భార్యభర్తలుగా విడిపోయినా.. స్నేహితుల్లా మాత్రం కలిసి ఉంటామని కూడా వీరు తెలియజేసారు. ఈ విషయం పై నాగార్జున, అమల వంటి వారు కూడా తమ బాధని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా…సమంత ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించడం లేదు.
ఓ రకంగా అక్టోబర్ 2 నుండీ చాలా సైలెంట్ అయిపొయింది. విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించిన క్షణం నుండీ ఇప్పటి వరకు ఈమె ట్విట్టర్ లో అయితే ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. అయితే ఇన్‌స్టాలో మాత్రం ఈమె ఆ విషయం పై స్పందించింది. ఇటీవల ఆమె ‘ఈ ప్రపంచాన్ని మనం మార్చాలనుకుంటే .. మనం ముందుగా మారాలి. మన పనులని మనమే చేసుకోవాలి. మనమే మన షెల్ఫ్‌ల దుమ్ముదులుపుకోవాలి.ఐహిక విచారాలతో మధ్యాహ్నం వరకు నిద్రపోయేవారంగా మనం ఉండకూడదు.
ఊహల్లో తేలేవారంగా ఉండొద్దు. ’ అంటూ పేర్కొంది.దీని తర్వాత మరో పోస్ట్ ఆమె పెట్టలేదు. ఏదేమైనప్పటికీ కొన్నాళ్లపాటు ఆమె సోషల్ మీడియాలో కనబడే అవకాశాలు లేవని ఇన్సైడ్ టాక్.