ఆ విషయాన్ని స్వయంగా చెప్పిన సమంత

  • September 1, 2018 / 10:00 AM IST

అక్కినేని కోడలు సమంత చేసిన తొలి లేడీ ఓరియెంటెడ్ చిత్రం “యూ టర్న్”. కన్నడలో హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రీమేక్ చేశారు. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత జర్నలిస్ట్ గా కనిపించనుంది. భూమిక, అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 11న థియేటర్లోకి రానుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీకి ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అందులో భాగంగా మీడియా ముందుకు వచ్చిన సమంత అనేక సంగతులు చెప్పింది.

వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది. “నేను 11వ క్లాసులో ఉన్నప్పుడే నాన్నగారు స్కూటీ కొనిచ్చారు. దానిపై పల్లవరం ఇన్ సైడ్ వీధుల్లో మాత్రమే తిరగమని నాన్న స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తో పనేం ఉంటుంది? అందుకే స్వేచ్ఛగా తిరిగేసేదాన్ని. ఓసారి ఎవరికీ చెప్పకుండా, లైసెన్స్ లేకుండానే స్కూటీ మీద విమానాశ్రయానికి వెళ్లిపోయాను. పోలీసులు ఆపి లైసెన్స్ అడిగారు. ప్లీజ్ ప్లీజ్! అంటూ రిక్వస్ట్ చేసుకుని ఏదోలా అప్పటికి తప్పించుకున్నాను” అంటూ కాలేజీ రోజులను గుర్తుచేసుకుంది. “యూ టర్న్”లోను సమంత స్కూటీపైనే తిరుగుతూ ఇన్వెస్ట్ గేషన్ చేస్తుంది. ట్రైలర్ తో అందరిలో ఆసక్తిని రేకెత్తించిన ఈ మూవీ ఎంతమేర ఆకట్టుకుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus