నాగచైతన్య తో పెళ్ళైన తరువాత సమంత క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. గ్లామర్ పాత్రలను తగ్గించి కథాబలం ఉన్న పాత్రల్నే ఎంచుకుంటూ హిట్లు మీద హిట్లు కొడుతుంది ఈ భామ. తెలుగుతో పాటూ తమిళ్ లో కూడా సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇటీవల విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సూపర్ డీలక్స్’ చిత్రం సూపర్ హిట్ కావడం, అందులోనూ తన పాత్రకి ప్రశంసలు దక్కడం సమంత కి బాగా కలిసొచ్చింది. ఇక తన భర్త నాగచైతన్య తో చేసిన ‘మజిలీ’ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
చైతన్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచిపోయింది. ఇలా వరుస హిట్లందుకోవడంతో ఇప్పుడు తన రెమ్యూనరేషన్ పెంచేసిందట సమంత. ఇప్పటి వరకూ 2 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సామ్… ఇప్పుడు 3 కోట్ల వరకూ డిమాండ్ చేస్తుందట. అయినప్పటికీ దర్శక నిర్మాతలు ఓకే చెబుతున్నారని సమాచారం. పెళ్ళైన తరువాత ఏ హీరోయిన్ కు అయినా క్రేజ్ కాస్త తగ్గే అవకాశాలే ఎక్కువ. కానీ సమంతకు మాత్రం ఇంకా పెరుగుతూనే ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం.