సమంత కొత్త సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

  • December 9, 2017 / 01:43 PM IST

పనిని కొంతమంది శ్రద్ధగా చేస్తారు. మరికొంతమంది ఇష్టంగా చేస్తారు. సమంత మాత్రం పనిని ఎంజాయ్ చేస్తూ చేస్తుంది. పనిలోనే ఆనందాన్ని చూసుకుంటుంది. అలాంటి మైండ్ సెట్ ఉంది కాబట్టే పెళ్లి అయి పది రోజులు కాకముందే సెట్స్ లోకి వచ్చింది. రామ్ చరణ్ సరసన రంగస్థలం మూవీని కంప్లీట్ చేసింది. అలాగే మహానటి లో తన పోర్షన్ పూర్తి చేసింది. ఇక తమిళంలో శివ కార్తికేయన్, విజయ్ సేతుపతి సినిమాలను చకచకా పూర్తి చేయనుంది. ఇదంతా పెళ్ళికి ముందు ఒప్పుకున్నా ప్రాజెక్ట్స్ కదా.. అందుకే కమిట్మెంట్ తో నటిస్తోంది అని అనుకున్నారు. అలా అనుకున్నవారందరికీ సమంత షాక్ ఇచ్చింది. జనవరి నుంచి కొత్త సినిమాని మొదలు పెట్టడానికి రెడీ అయింది.

కన్నడ మిస్టరీ సినిమా “యుటర్న్‌” రీమేక్ లో నటించడానికి సిద్ధమైంది. 2016లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. శ్రద్ధా శ్రీనాథ్‌, రోగర్‌ నారాయణ్‌, దిలీప్‌ రాజ్‌, రాధికా చేతన్‌ ల నటన సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. శ్రద్ధా శ్రీనాథ్‌ పోషించిన జర్నలిస్ట్ పాత్రలో సమంత కనిపించనుంది. కన్నడ వెర్షన్ కి దర్సకత్వం వహించిన పవన్‌కుమార్‌ దీనిని తెలుగు, తమిళ భాషల్లో సొంతంగా నిర్మించబోతున్నారు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోన్న ఈ సినిమా గురించి అధికారికంగా త్వరలో ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus