Samantha: మనమంతా ఒక్కటే… అవి వేరు చేస్తాయి!

  • May 8, 2023 / 01:37 PM IST

సమంత నాగచైతన్య ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నప్పటికీ కొంతకాలం పాటు సంతోషంగా ఉన్న కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ దంపతుల విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ వీరి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. సమంత నాగచైతన్య విడాకులకు కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. అయితే తాజాగా సమంత నుంచి విడాకులు తీసుకోవడానికి గల కారణాలను నాగచైతన్య తెలియజేశారు. సమంత తాను రెండు సంవత్సరాల క్రితం విడిపోయామని అయితే మేము విడిపోవడానికి గల కారణం సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ అని తెలిపారు.

ఇలా ఈ రూమర్స్ కారణంగా మా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి అయితే ఆ గొడవలు పెరిగి పెద్దవి కావడంతోనే విడాకుల వరకు వెళ్ళామని నాగచైతన్య తెలిపారు. అయితే సమంత జ్ఞాపకాలను తాను ఇప్పటికీ గౌరవిస్తానని తాను చాలా మంచి అమ్మాయి అంటూ సమంత గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఇకపోతే నాగచైతన్య సమంత గురించి విడాకుల గురించి ఇలా చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే ఈ వ్యాఖ్యలపై సమంత పరోక్షంగా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక కొటేషన్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. సమంత షేర్ చేసిన ఈ కొటేషన్ లో ఏముంది అనే విషయానికి వస్తే…. మనమంతా ఒక్కటే కానీ కోపం భయం అనేవి మనల్ని వేరు చేస్తాయి అంటూ ఉన్నటువంటి కొటేషన్ షేర్ చేశారు.

ఈ విధంగా సమంత మనం ఒకటేనని కోపం భయం మాత్రమే మనల్ని దూరం చేస్తాయి అంటూ చెప్పడంతో కేవలం ఇద్దరి మధ్య ఏర్పడిన అపోహలు, ఈగో కారణంగానే వీరిద్దరూ విడిపోయారని వీరిద్దరి మధ్య ప్రేమ అలాగే ఉందని అర్థమవుతుంది ఇలా సమంత నాగచైతన్య చేసినటువంటి ఈ కామెంట్స్ చూసిన అభిమానులు తిరిగి వీరిద్దరూ కలిసి పోతే బాగుంటుంది అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus