కంగనా పై సమంత ప్రశంసలు..!

  • January 29, 2019 / 07:44 AM IST

సినీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ని మరో మరో హీరోయిన్ మెచ్చుకోవడం చాలా అరుదనే చెప్పాలి. అయితే మారుతున్న ట్రెండ్ ను బట్టి హీరోయిన్లు కూడా మారుతున్నారు. వారి తోటి హీరోయిన్స్ ఎవరైనా బాగా నటిస్తే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు కొందరు హీరోయిన్‌లు. ఇక లిస్ట్ లో సమంత కూడా చేరిపోయింది. తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ పై ప్రశంసల వర్షం కురిపించింది సమంత. ఇటీవల విడుదలైన ‘మణికర్ణిక’ చిత్రంలో తన నటినతో మరోసారి ఆకట్టుకుంది కంగనా. వీరనారీ ఝాన్సీలక్ష్మీబాయ్‌ పాత్రలో కంగనా సాహసోపేతమైన నటనను ప్రదర్శించింది.

ఇక తాజాగా ‘మణికర్ణిక’ చిత్రం చూసిన సమంత… కంగనా నటనను మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించింది. సమంత స్పందిస్తూ… “కంగనానే నా హీరో.. ప్రస్తుత హీరోయిన్లు ఎవరూ నటించడానికి సాహసించని యాక్షన్‌ కథా పాత్రని ఎంచుకుని చాలా గొప్పగా నటించింది’… అంటూ ప్రశంసించింది సమంత. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత కూడా పాత్రల ఎంపిక విషయంలో కంగనా లాగానే కథలో కీలకమైన పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక ప్రస్తుతం తన భర్త నాగ చైతన్యతో కలిసి ‘మజిలీ’ చిత్రంలో నటిస్తున్న సమంత ’96’ తెలుగు రీమేక్ లో కూడా నటిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus