తనపై వస్తున్న వార్తలపై స్పందించిన సమంత

  • July 25, 2018 / 08:01 AM IST

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి సినిమాల తర్వాత చేస్తున్న #RRR సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా సాగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి తొలిసారి నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొని ఉంది. భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా కీర్తి సురేష్, రాశీ కన్నా నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరికొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ గురించి మరో వార్త వైరల్ అయింది. రాజమౌళి ఇందులో హీరోయిన్ గా నటించమని సమంతని కోరగా..

ఆమె ఈ ఆఫర్ ని తిరస్కరించినట్లు న్యూస్ సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. దీనిపై సమంత స్పందించింది. ఆ వార్తలను ఖండించింది. “ఇంతవరకు #RRR టీమ్‌ కు సంబంధించి ఎవరూ నన్ను నటించమని సంప్రదించలేదు. నేను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో హీరోయిన్ పాత్రను రిజెక్ట్‌ చేశానని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం” అని వెల్లడించింది. సమంత రీసెంట్ గా యూ టర్న్ సినిమాని కంప్లీట్ చేసింది. అలాగే తమిళంలో చేస్తున్న రెండు సినిమాలను పూర్తి చేసింది. తాజాగా నాగ చైతన్య తో కలిసి నటించడానికి సిద్ధమైంది. మరికొన్ని కథలను పరిశీలిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus