Samantha: హాలీవుడ్ సినిమాలో టాలీవుడ్ హీరోయిన్!

  • November 15, 2021 / 12:14 PM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత మంచి జోరు మీదుంది. వరుస సినిమాలు ఒప్పుకుంటూ ఆశ్చర్యపరుస్తుంది. ఫాస్ట్ ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకుంటూ దూసుకుపోతుంది. ఇటీవల ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన ఆమె తెలుగులో ఓ థ్రిల్లర్ కు ఓకే చెప్పింది. ఓ బైలింగ్యువల్ సినిమా కూడా ఒప్పుకుంది. మరోపక్క ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుందంటూ వార్తలొస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉండగానే..ఓ ఇంటెర్నేషనల్ సినిమాలో నటించడానికి కూడా నటించడానికి ఒప్పుకుందట.

తెలుగు నిర్మాత సునీత తాటి నిర్మించబోయే ఓ ఇంటర్నేషనల్ సినిమాలో సమంత హీరోయిన్ గా చేస్తోంది. ‘అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ అనే ఈ సినిమాకు ఫిలిప్ జాన్ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. రైటర్ తిమెరి ఎన్ మురారి నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం ఇండియాలోనే జరగనుంది. అలానే వేల్స్ లో కొంత భాగంగా షూటింగ్ జరిపించనున్నారు. గతంలో సమంత సునీత తాటి నిర్మించిన ‘ఓ బేబీ’ సినిమాలో నటించింది.

ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో సినిమా రాబోతుంది. అది కూడా ఇంటర్నేషనల్ సినిమా కావడం విశేషం.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus