అక్కినేని సమంత సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆమె ఎలాంటి పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతుంటుంది. ఇక ప్రతి సంతోషాన్ని అభిమానులతో పంచుకునే సమంత ఇటీవల ఒక చేసిన ఒక పోస్ట్ విషయంలో ఎందుకో తడబడినట్లు తెలుస్తోంది. పోస్ట్ చేసిన వెంటనే డిలీట్ చేయడం వెనుక స్టోరీ ఏమిటనేది హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా సమంత తన దగ్గర పని చేసేవారికి చాలా వాల్యూ ఇస్తుంది.
తన ఇంట్లో మనిషిగా చూసుకోవడం ఆమెకు అలవాటు. సమంత దగ్గర ఒక్కసారి వర్క్ చేస్తే వారు అలా కొనసాగుతూనే ఉంటారు. అంతలా వారికి వాల్యూ ఇస్తుంది. ఇక ఇటీవల ఒక వ్యక్తితో ఉన్న ఫొటోను పోస్ట్ చేసినట్టే చేసి వెంటనే డిలీట్ చేసింది. అందులో పడుకొని ఉన్న సమంత అతనిపై కాళ్ళు కూడా పెట్టింది. నాలుగేళ్లుగా సమంత వద్ద స్టైలిష్ట్ గా వర్క్ చేస్తున్న ప్రీతమ్ జుకాల్కర్తో తీసుకున్న ఫొటోను సమంత తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు.
నాలుగేళ్లు కలిసి ఉన్నాము అని ఫొటో పోస్ట్ చేసిన సమంత లవ్ సింబల్ ను కూడా జత చేసింది. ఇక అతను అయితే ఇన్ స్టా స్టోరీలో లవ్యూ అని పెట్టాడు. వీరి పోస్ట్ లు ఎక్కువ సేపు ఉండలేదు. వెంటనే సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశారు. కానీ అప్పటికే అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి సమంత అంత సడన్ గా ఎందుకు డిలీట్ చేసిందో తెలియాలి అంటే ఆమెనే క్లారిటీ ఇవ్వాలి.