Samantha: మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన సామ్.. ఏం చెప్పారంటే?
March 8, 2024 / 07:47 PM IST
|Follow Us
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సోషల్ మీడియాలో ఏం మాట్లాడినా సంచలనం అవుతోంది. ప్రత్యక్షంగా చెప్పకపోయినా వేర్వేరు సందర్భాల్లో విడాకుల గురించి సమంత ప్రధానంగా ప్రస్తావించడం జరుగుతోంది. మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశిస్తూ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనపై మనకు ఉన్న విశ్వాసం గొప్ప వ్యక్తిగా ఎదగడానికి సహాయపడుతుందని సమంత తెలిపారు. నేను అభద్రతాభావానికి లోనవుతున్నానని తెలుసుకోగలిగానని ఆమె చెప్పుకొచ్చారు. త్వరగా దాని నుంచి బయటకు వచ్చానని సమంత కామెంట్లు చేశారు.
భౌతిక గాయాలతో పోల్చి చూస్తే మనస్సుకు అయిన గాయం నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని సమంత పేర్కొన్నారు. ఒక మ్యాగజైన్ కు సమంత ఇచ్చిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా ఆ ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సమంత గ్లామర్ గా కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బరువు తగ్గిన సమంత స్లిమ్ లుక్ లో కొత్తగా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన కొంతమంది నెటిజన్లు మాత్రం మాకు పాత సమంత కావాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
సమంత క్రేజ్, రేంజ్ వేరే లెవెల్ అని ఆమెకు భారీ విజయాలు దక్కాలని కోరుకుంటున్నామని ఫ్యాన్స్ చెబుతున్నారు. సమంత కెరీర్ ప్లానింగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని సమాచారం అందుతోంది. సమంత రీఎంట్రీలో ఇతర భాషలపై కూడా ఫోకస్ పెడతారేమో చూడాలి. గతేడాది (Shaakuntalam) శాకుంతలం, (Kushi) ఖుషి సినిమాలతో సామ్ ప్రేక్షకుల ముందుకు రాగా శాకుంతలం ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా ఖుషి సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించింది.
ఖుషి సినిమాలో బ్రాహ్మణ యువతిగా ఆమె నటించారు. సమంత మంచి ప్రాజెక్ట్ లతో రీఎంట్రీ ఇస్తే మరికొన్ని సంవత్సరాల పాటు ఆమె కెరీర్ కు ఢోకా ఉండదని సమంత చెబుతున్నారు. సమంత రెమ్యునరేషన్ విషయంలో సైతం టాప్ లో ఉన్నారు. వరుస విజయాలు సాధించేలా సమంత అడుగులు వేస్తారేమో చూడాలి.