నాగచైతన్య సమంత విడాకుల సమయంలో చైసామ్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. సమంత చైతన్య నుంచి కోట్ల రూపాయలు భరణంగా తీసుకుందని, పిల్లల విషయంలో వాళ్లిద్దరి మధ్య గొడవలు జరిగాయని, సమంత డ్రెస్సింగ్ విషయంలో అక్కినేని కుటుంబం అభ్యంతరాలు వ్యక్తం చేసిందని రూమర్లు ప్రచారంలోకి రాగా చివరకు అవి రూమర్లేనని తేలిపోయింది. విడిపోయిన తర్వాత చైతన్య, సమంత వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. కెరీర్ విషయంలో దూకుడును ప్రదర్శిస్తూ చైతన్య, సమంత వరుసగా సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు.
అయితే పెళ్లి చీర విషయంలో సమంత షాకింగ్ నిర్ణయం తీసుకుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పెళ్లి సమయంలో సమంత ధరించిన చీర నాగచైతన్య అమ్మమ్మ చీర కావడం గమనార్హం. ఆ చీరకు రీమోడలింగ్ చేయించి సమంత ధరించారు. ఆ చీరను రీమోడలింగ్ చేయించడం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఈ పెళ్లి చీరను సమంత తాజాగా చైతన్యకు తిరిగిచ్చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
చైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు తన దగ్గర ఉండకూడదని భావించి సమంత ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. అయితే చైతన్య సన్నిహితులు కానీ సమంత సన్నిహితులు కానీ ఈ విషయంపై స్పందించలేదు. ఎంతో అన్యోన్యంగా ఉన్న చైసామ్ దంపతులు విడిపోవడం బాధాకరమని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చైతన్య క్లాస్ సినిమాలకు ఓటేస్తుంటే సమంత మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఓటేస్తున్నారు. చైసామ్ కెరీర్ పరంగా వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.
సినిమాసినిమాకు చైతన్య, సమంతలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. బంగార్రాజు సినిమాతో నాగచైతన్య మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. సమంత నటించిన శాకుంతలం సినిమా త్వరలో రిలీజ్ కానుంది.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!