Samantha, Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సమంత.. నెటిజన్ల రియాక్షన్ చూశారా?

  • May 9, 2022 / 08:52 PM IST

విడాకుల తరువాత సినిమాల పరంగా తన జోరు మరింత పెంచింది సమంత. వరుస సినిమాలను ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘యశోద’ అనే సినిమాలో నటిస్తోంది. ఆగస్టు 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ఇదివరకు సమంత-విజయ్ దేవరకొండ కలిసి ‘మహానటి’లో కనిపించారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ జంటగా కనిపించనున్నారు.

ఈరోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో సమంత అండ్ సినిమా టీమ్ అతడి పుట్టినరోజు వేడుకలు నిర్వహించింది. అలానే సమంత సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండ విషెస్ చెప్పింది. ‘హ్యాపీ బర్త్ డే లైగర్.. ఈ ఏడాది నీకు రాబోయే ప్రశంసలు, సక్సెస్ అన్నింటికి నీవు అర్హుడివే.. నువ్ కష్టపడే తీరు అందరికీ ఎంతో స్పూర్తిదాయకం.. గాడ్ బ్లెస్’ అంటూ విజయ్ తో దిగిన ఫొటోను షేర్ చేసింది. సమంత పెట్టిన ఈ పోస్ట్ పై నెటిజన్లు వింతగా కామెంట్స్ చేస్తున్నారు.

క్యూట్ కపుల్, లవ్లీ కపుల్, మీ ఇద్దరూ పెళ్లి చేసుకోండి అంటూ సలహాలు ఇస్తున్నారు. మరి వీటిపై సమంత ఘాటుగా రియాక్ట్ అవుతుందేమో చూడాలి. ఈ సంగతి పక్కన పెడితే ఆన్ స్క్రీన్ పై ఈ జంట కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉండబోతుంది. శివ నిర్వాణ మరో అద్భుతమైన కథతో ఈ సినిమాను తీయబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈరోజే సినిమా నుంచి ‘లైగర్ హంట్’ అనే థీమ్ సాంగ్ ను విడుదల చేశారు. ఇందులో విజయ్ పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి!

1

2

3

4

5

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus