నాగచైతన్య ఎలాంటి వాడో నాకు తెలుసు.. మీరు జోక్యం చేసుకోకండి
March 26, 2019 / 12:43 PM IST
|Follow Us
కొంచెం మొరటుగా ఉంటుంది కానీ.. ఒక సామెత ప్రస్తుతం జనాల సోషల్ మీడియా పోకడకి పర్ఫెక్ట్ గా ఉంటుందని చెబుతున్నా.. “ఎవడి ముడ్డి ఆడు కడుక్కుంటేనే బాగుంటుంది.. పక్కోడికి కడగాలని ప్రయత్నిస్తే కంపు కొడుతుంది”. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో కొందరు జనాలు చేస్తున్న పని అదే. ఎవరైనా సెలబ్రిటీ ఒక స్టేటస్ కానీ ఫోటో కానీ అప్డేట్ చేయడం పాపం వెంటనే.. సదరు ట్వీట్/స్టేటస్ అప్డేట్ కింద పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయడం కామన్ అయిపోయింది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈ విషయమై స్పందిస్తూ.. “మీ పని మీరు చేసుకోండి.. మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి” అని కోరారు కూడా. కానీ.. కుక్క తోక వంకర అన్నట్లు జనాలు వింటేనా.
తాజాగా చైతూ-సమంతల విషయంలోనూ అదే జరిగింది. వాళ్ళిద్దరూ కలిసి నటించిన తాజా చిత్రం “మజిలీ” సినిమాలోని కొత్త పాట విజువల్స్ విడుదలయ్యాయి. అందులో నాగచైతన్య మరో హీరోయిన్ అయిన దివ్యకు లిప్ లాక్ ఇస్తున్న స్టిల్ ఒకటి ఉంది. దాంతో కొందరు కంగారు నాయాళ్ళు “సమంతను పెళ్లి చేసుకొని.. వేరే అమ్మాయికి అలా లిప్ లాక్స్ ఎలా ఇస్తావ్?” అని క్వశ్చన్ చేయడమే కాక.. తిట్టడం మొదలెట్టారు. దాంతో వెంటనే స్పందించిన సమంత “నా భర్త నాగచైతన్య ఎలాంటి వాడో నాకు తెలుసు.. మీరు జోక్యం చేసుకోకండి” అని గట్టిగానే చెప్పింది. అయినప్పటికీ ఆత్రంగాళ్ళు ఆగరనుకోండి. కానీ.. ఎప్పటికైనా ఈ జోక్యం చేసుకోవడం అనేది మానాలి ఈ ట్విట్టరోళ్ళు.