‘సంపూర్ణ ప్రేమాయణం’ సినిమా కోసం శోభన్ బాబు కాస్ట్యూమ్స్ ఏ దేశంలో కొన్నారంటే..?
December 15, 2022 / 08:25 PM IST
|Follow Us
నటభూషణ శోభన్ బాబు కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి.. పౌరాణిక, చారిత్రాత్మక, సాంఘిక సినిమాల్లో నటించి ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్నారు.. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ తర్వాత అంతటి స్టార్ డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.. కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు శోభన్ బాబు.. 30 ఏళ్ల నట ప్రస్థానంలో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, పాత్రలు చేసి మెప్పించారు.. అప్పట్లో ఆయన సినిమాలంటో మహిళఆ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది..
ఎవరికైనా జుట్టు నుదుటి మీద రింగులా కనిపిస్తే.. ఇప్పటికీ శోభన్ రింగ్ అంటుంటారు.. ‘రాజువయ్యా’, ‘గాలి వానలో’ పాటల్లో ఆయన బాధపడుతుంటే చూసి ప్రేక్షకులు కంటతడి పెట్టేవారు.. అంటే, అంతలా ఆకట్టుకునేవారాయన.. నటభూషణ ఓ సినిమాలో వాడిన కాస్ట్యూమ్స్ విషయం అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.. ఏంటా సినిమా?.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. శోభన్ బాబు, జయప్రద జంటగా.. ఎన్.బి. చక్రవర్తి దర్శకత్వంలో, శ్రీ రాజ్యలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద మిద్దే రామారావు నిర్మించిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్..
‘సంపూర్ణ ప్రేమాయణం’.. 1971లో ‘సంపూర్ణ ప్రేమాయణం’ వంటి పౌరాణిక చిత్రంలో నటించిన శోభన్ బాబు.. ఒక్క అక్షరం తేడాతో అదే పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలోనూ నటించడం విశేషం.. సత్యనారాయణ, రావుగోపాల రావు, నూతన్ ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, సుత్తి వేలు, సుత్తి వీరభద్రరావు, అన్నపూర్ణ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. అప్పటి స్పెషల్ సాంగ్స్ సెన్సేషన్ సిల్క్ స్మిత ఓ పాటలో ఆడిపాడింది.. ఇందులో శోభన్ బాబు కోసం కేర్ తీసుకుని ప్రత్యేకంగా డ్రెస్సులు డిజైన్ చేయించారు..
ఆయన సినిమాల్లో కాస్ట్యూమ్స్ కూడా ఆకట్టుకునేవి.. ఈ ‘సంపూర్ణ ప్రేమాయణం’ లో నటభూషణ కోసం సింగపూర్లో షాపింగ్ చేశారు.. ఇందుకోసం అక్షరాలా రూ. 2 లక్షలు ఖర్చు పెట్టారు.. ఆరోజుల్లో, తెలుగులో ఒక సినిమాలో హీరో కాస్ట్యూమ్స్ కొరకు 2 లక్షలు (అదీ సింగపూర్లో) ఖర్చు చేయబడిన తొలి సాంఘిక చిత్రం ఇది.. అందుకే అప్పట్లో దీని గురించి పరిశ్రమలో ఎక్కవగా మాట్లాడుకునేవారు.. 1984 డిసెంబర్ 15న రిలీజ్ చేయగా ఘన విజయం సాధించిందీ సినిమా..