భారీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ తో ‘గంధర్వ’ మూవీ!

  • October 25, 2021 / 04:42 PM IST

‘వంగవీటి, ‘జార్జిరెడ్డి’ ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా గాయత్రి ఆర్. సురేష్, శీత‌ల్ భ‌ట్ హీరోయిన్స్‌గా రూపొందుతున్న చిత్రం ‘గంధర్వ’. ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై ఎం.ఎన్‌.మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని ఒక పాయింట్ తో రూపొందుతున్న ఈ చిత్రం తో అప్సర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్, సురేష్, బాబు మోహన్ వంటి వారు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ లకు మంచి స్పందన లభించడమే కాకుండా సినిమా పై అంచనాలు పెంచేలా చేశాయి.

ఇండియ‌న్ సినిమాల్లో ఇప్పటివరకు రాన‌టువంటి ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో ఈ చిత్రం రూపొందుతుండగా.. ఇప్ప‌టి వరకు చేయని ఓ వైవిధ్యమైన రోల్‌లో హీరో సందీప్ మాధ‌వ్ క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలుంటాయ‌ని ఇది వరకే చిత్ర బృందం వెల్లడించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి. ఇటీవల షూటింగ్ జరిగిన ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో హీరో సందీప్ తో పాటు ముఖ్యనటులు సాయి కుమార్ , సురేష్ లతో పాటు 50 మంది ఫైటర్స్ పాల్గొన్నారు.

తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ ఫైట్ సీన్ లో పాల్గొన్న ఫైటర్స్ కు హీరో సందీప్ మాధవ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు వారికి వెండి నాణాలను బహుకరించి అభినందించారు. ఈ ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని ఈ సినిమా కోసం పనిచేసిన వారంతా ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఈ చిత్రంలో నటించిన నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా పాల్గొన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus