అర్జున్ రెడ్డి డైరక్టర్ సెకండ్ మూవీ రిలీజ్ డేట్!

  • March 2, 2021 / 12:31 PM IST

అర్జున్ రెడ్డిఅర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు సందీప్ వంగ అదే కథను బాలీవుడ్ కూడా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. సినిమాతో టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు సందీప్ వంగ అదే కథను బాలీవుడ్ కూడా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. కబీర్ సింగ్ గా వచ్చిన ఆ సినిమా అక్కడ కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను అందుకుంది. ఇక తెలుగులో హిట్టిచ్చినా కూడా స్టార్ హీరోలతో ఛాన్స్ అందుకోలేకపోయిన సందీప్ బాలీవుడ్ లో మాత్రం మంచి ఆఫర్ పట్టాడు. రణ్ బీర్ కపూర్ తో ‘ఎనిమల్’ అనే ఒక యాక్షన్ సినిమాను చేస్తున్నాడు.

ఆ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్ మోస్ట్ ఫినిష్ అయ్యాయి. ఇక పర్ఫెక్ట్ ప్లాన్ తో షూటింగ్ స్పీడ్ పెంచనున్న సందీప్ రిలీజ్ పై కూడా ముందే క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమాను దసరా సందర్భంగా రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారట. ఇక కుదిరితే ఎనిమల్ సినిమాను తెలుగులో కూడా డబ్ చేయాలనీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇంతవరకు టాలీవుడ్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపని రణ్ బీర్, సందీప్ టాలెంట్ ను నమ్మి తెలుగు మార్కెట్ పై కూడా ఒక బాణం వేయాలని ఆలోచిస్తున్నాడట.

సందీప్ అర్జున్ రెడ్డి సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక హిందీ కబీర్ సినిమా తెలుగు రాష్టాల్లో కూడా విడుదల కాగా మల్టిప్లెక్స్ లలో మంచి క్రేజ్ అందుకుంది. మరి ఎనిమల్ సినిమా ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus