Major Movie: ఈ సినిమా మా దుఃఖాన్ని మరిచేలా చేసింది: సందీప్ తండ్రి!

  • June 3, 2022 / 05:23 PM IST

26/11 ముంబై టెర్రరిస్ట్ దాడులలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పోరాటం చేస్తూ వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చే మొదటి షో తోనే ఎంతో అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా చూసిన ఎంతో మంది నెటిజన్లు ఈ సినిమాపై వారి అభిప్రాయాలను తెలియ చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాని మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు చూసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా చూసిన సందీప్ తల్లిదండ్రులు ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్ చేశారు. తమ కుమారుడు సందీప్ జీవిత కథను మంచి సినిమాగా తెరకెక్కించిన చిత్ర బృందానికి కృతజ్ఞతలు అంటూ తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో నటీనటుల నటన ఎంతో అద్భుతంగా ఉందని వెల్లడించారు. ఈ సినిమాతో మా కుమారుడు లేడని దుఃఖాన్ని మర్చిపోయేలా చేసిందని సందీప్ తండ్రి కె ఉన్నికృష్ణన్ తెలియచేశారు. అందరూ కూడా సందీప్ వెళ్లి పోయాడు చనిపోయాడు అనుకుంటున్నారు. కానీ నా బిడ్డ ఆఖరి శ్వాస వరకు నా దేశ ప్రజలను కాపాడటం కోసం పోరాటం చేశారని, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని ఉన్ని కృష్ణన్ వెల్లడించారు.

ఈ విధంగా సందీప్ తండ్రి కే ఉన్నికృష్ణన్ మేజర్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు.అదే విధంగా ఈ సినిమా చూసిన ఎంతో మంది నెటిజన్లు ఎమోషనల్ అవుతూ సినిమా గురించి వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియచేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా అత్యధిక థియేటర్లలో ఎంతో విజయవంతంగా ప్రసారమవుతుంది. ఇక ఈ సినిమాకి మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus