సంజయ్ దత్ ఏ సినిమాలో నటిస్తున్నారంటే..

  • September 19, 2016 / 07:32 AM IST

జైలు నుండి బయటికొచ్చిన అనంతరం సంజయ్ దత్ వరుస సినిమాలతో బిజీ కానున్నారని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. మున్నాభాయ్ సిరీస్ లో మరో సినిమాతో పాటు రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో సంజయ్ దత్ బయోపిక్ తెరకెక్కుతుందన్న ప్రచారమూ జరిగింది. వాటి మాట ఎలా ఉన్నా సంజయ్ నటించబోయే తర్వాతి సినిమాపై ఇప్పుడో క్లారిటీ వచ్చింది.

తొలి చిత్రం “జల్”తో ప్రశంసలందుకున్న గిరీష్ మాలిక్ రెండో ప్రయత్నంగా “తొర్భాజ్” సినిమాని తెరకెక్కించనున్నారు. ఆఫ్గనిస్థాన్ యుద్ధ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ సైనిక అధికారి పాత్రలో కనపడనున్నారు. కథాబలమున్న చిత్రాలు మాత్రమే చేస్తానని ఆ మధ్య స్పష్టంగా పేర్కొన్న దత్ ఈ కథ విన్న వెంటనే ఎస్ చెప్పారట. బాలలను ఆత్మాహుతి బాంబులుగా మార్చే క్రూర ప్రక్రియను ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus