పాన్ ఇండియా సినిమా అంటే… అన్ని భాషల చిత్ర పరిశ్రమల నుండి నటీనటుల్ని తీసుకోవాలి. అప్పుడే ఆ భాష వాళ్లను ఆకట్టుకోగలం. చాలా కాలంగా మన వాళ్లు ఇదే ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్‌బాబు చేయబోతున్న తొలి పాన్ ఇండియా సినిమా అని అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేకపోయినా… కాస్ట్ అండ్ క్రూ ఎంపిక చూస్తే మాత్రం అదే అనిపిస్తోంది. తాజగా ఈ సినిమాకు మెయిన్ విలన్‌ను ఎంపిక చేశారట.
మహేష్‌బాబుకు విలన్‌గా ఈసారి బాలీవుడ్ స్టార్ యాక్టర్‌ను తీసుకురాబోతున్నారట త్రివిక్రమ్. ‘కేజీఎఫ్ 2’తో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్న సంజయ్ దత్‌ను ssmb28తో టాలీవుడ్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు కూడా మొదలయ్యాయని సమాచారం. మరి సంజూ బాబా ఏమంటారు, మహేష్‌కు విలన్‌గా మారతారా అనేది ఆసక్తికరంగా ఉంది. ఇక ఈ సినిమా అప్‌డేట్స్ గురించి చూస్తే… ‘సర్కారు వారి పాట’ పనులు పూర్తయ్యాక మహేష్‌బాబు ఈ సినిమా ప్రారంభిస్తారని సమాచారం.
అప్పటిలోపు త్రివిక్రమ్ ‘భీమ్లా నాయక్’ పనులు పూర్తి చేసుకుంటారట. మరోవైపు ssmb28 ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా సాగుతున్నాయట. ఇందులో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. సినిమాకు ‘పార్థు’ అనే పేరు పరిశీలనలో ఉంది.
Most Recommended Video
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!