Sanjana: బేబీ బంప్ వీడియోని షేర్ చేసిన బుజ్జిగాడు హీరోయిన్ సంజనా గల్రాని వీడియో వైరల్..!

  • February 24, 2022 / 06:36 PM IST

ప్రభాస్- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘బుజ్జిగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన సంజనా గల్రాని. ఆ చిత్రంలో త్రిష చెల్లిగా నటించిన సంజనా గల్రానీ.. ఆ మూవీతో బాగా పాపులర్ అయ్యింది. అటు తర్వాత ‘సత్యమేవ జయతే’, ‘దుశ్శాసన’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఈమెకు ఏమీ కలిసిరాలేదు. కోలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించినా అవి కూడా అమ్మడికి బ్రేక్ ఇవ్వలేకపోయాయి. అయితే శాండల్ వుడ్ డ్రగ్స్‌ రాకెట్ కేసులో ఈమె అరెస్ట్ అయ్యి జైలు శిక్ష అనుభవించడంతో ఈమె పేరు దేశం మొత్తం మార్మోగింది.

Click Here To Watch

మొత్తంగా ఈమె మూడు నెలల పాటు జైలు జీవితం గడిపింది. తర్వాత బెయిల్‌పై రిలీజ్ అయిన ఈమె అజీజ్‌ బాషా అనే వ్యక్తిని సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. అతని కోసం ఈమె ఇస్లాం మతాన్ని తీసుకుంది.ఈ విషయాన్ని ఆమె ఆలస్యంగా తెలియజేసింది. ఇక దాంపత్య బంధానికి గుర్తుగా త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది సంజనా. ఈ మధ్యనే ఆ విషయాన్ని తెలిపిన ఈ అమ్మడు.. తాజాగా తన బేబీ బంప్ ఫోటోని కూడా షేర్ చేసింది.

అంతేకాకుండా ఇన్స్టాలో ఈ ఫోటోకి సంబంధించిన ఓ వీడియోని కూడా షేర్ చేసింది. తన బేబీ బంప్ ను చూపిస్తూ ఈ వీడియోని తీయడం జరిగింది. ప్రస్తుతం ఈమెకు 6వ నెల. ‘కడుపుతో ఉంది కదా అని విశ్రాంతి తీసుకోవాలనుకోవట్లేదని. ప్రసవం అయ్యేంతవరకు శ్రమించాలనుకుంటున్నానని, కొంతమంది మహిళలు తమ ప్రసవం తేదీ వరకు పనులు చేయడం చూశానని,తాను కూడా అలాగే ఉండాలనుకుంటున్నట్టు‘ ఈమెమొన్నామధ్య ఈమె చెప్పుకొచ్చింది

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus