చిరు, బాలయ్య సినిమాలు డేట్స్ లాక్!

  • December 1, 2022 / 04:23 PM IST

వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాల్సిన సినిమాలను ముందుగానే లాక్ చేసుకుంటున్నారు. ‘ఆదిపురుష్’ సినిమా పక్కకు తప్పుకున్న వెంటనే మేకర్స్ కి ఒక క్లారిటీ వచ్చేసింది. తెలుగు నుంచి మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘వాల్తేర్ వీరయ్య’, బాలయ్య నటించిన సినిమా ‘వీరసింహారెడ్డి’ సినిమాలను సంక్రాంతికి లాక్ చేశారు. తమిళం నుంచి ‘వారసుడు’ సినిమాను ముందుగానే కన్ఫర్మ్ చేశారు. ‘ఆదిపురుష్’ సినిమా తప్పుకోవడంతో అజిత్ ‘తునివు’ని కూడా లిమిటెడ్ రిలీజ్ తో అయితే తెలుగులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.

మెయిన్ గా మూడు సినిమాలకు థియేటర్ల సర్దుబాటు చర్చలు జరుగుతున్నాయి. అలానే రిలీజ్ విషయంలో ఇబ్బంది రాకుండా డేట్స్ ను కూడా సర్దుబాటు చేసుకోవడం కూడా పూర్తయినట్లు సమాచారం. ఆయా నిర్మాణ సంస్థలు డిస్ట్రిబ్యూటర్లకు రిలీజ్ డేట్స్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. సంక్రాంతికి ముందుగా ‘తునివు’ సినిమా రాబోతుంది. తమిళంలో ఈ సినిమాను జనవరి 11న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. తరువాతి రోజు ‘వరిసు’ సినిమాను రిలీజ్ చేసేలా ఒప్పందం కుదిరిందట.

తెలుగులో కూడా ‘వారసుడు’ సినిమా అదే ప్రకారం రిలీజ్ కానుంది. చిరంజీవి, బాలయ్యల సినిమాలు ఒకరోజు తరువాత మరొకటి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. జనవరి 12న ‘వీరసింహారెడ్డి’ డేట్ లాక్ చేయగా.. 13న శుక్రవారం ‘వాల్తేర్ వీరయ్య’ను రిలీజ్ చేయాలని ఈ రెండు సినిమాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఫిక్స్ అయింది.

‘వీరసింహారెడ్డి’ సినిమా ‘వారసుడు’తో క్లాష్ అవుతున్నప్పటికీ.. అది డబ్బింగ్ సినిమా అని ఊరుకుంటున్నారు. దాదాపు ఇదే డేట్స్ తో సినిమాలు రిలీజ్ అయ్యేలా ఉన్నాయి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus