సంక్రాంతి సినిమాల సంగతి ఇంకా తేలలేదు!

  • December 8, 2022 / 02:06 PM IST

అదేంటి.. సంక్రాంతి సినిమాల డేట్స్‌ అన్నీ చెప్పేశారుగా మళ్లీ ‘డేట్స్‌ ఇంకా చెప్పాలి’ అని అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా? అవును మీరు చెప్పింది కరెక్టే.. డేట్స్‌ అన్నీ చెప్పేశారు. అయితే ఇంకా చెప్పాల్సిన డేట్స్‌ రెండు ఉన్నాయి. ఇప్పటివరకు అందరూ అనుకుంటున్నట్లు సంక్రాంతికి నాలుగు సినిమాలు కాదు.. ఆరు సినిమాలు బరిలో ఉంటాయట. నాలుగు పెద్ద సినిమాలు అయితే… రెండు చిన్న సినిమాలు. తెలుగు, తమిళ పెద్ద సినిమాల పోరుతో బాక్సాఫీసు దగ్గర అలజడి రేగుతుంటే.. మధ్యలో చిన్న తెలుగు సినిమాలు వస్తున్నాయి.

వచ్చే పొంగల్‌ ఫైట్‌ గురించి, మధ్యలో చిన్న సినిమాల రాక గురించి తెలియాలంటే.. ఓసారి 2017 వరకు వెళ్లాలి. ఆ ఏడాది పొంగల్‌కి చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’, బాలకృష్ణ ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాలతో పాటు ‘శతమానం భవతి’ కూడా వచ్చింది. ఆ రెండు సినిమాలలాగే ఈ సినిమాకు మంచి విజయం అందుకుంది. ఆ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని వచ్చే ఏడాది రెండు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. సంతోష్ శోభన్ ‘కళ్యాణం కమనీయం’, శివాని ‘విద్యా వాసుల అహం’ కూడా వస్తుందట.

సంక్రాంతి సీజన్‌కే వచ్చి తమ సత్తా కూడా చూపించాలని అనుకుంటున్నారట. ఈ రెండు సినిమాలకు జనవరి 14న తీసుకురావాలని చూస్తున్నారట. ఈ మేరకు త్వరలో ప్రచారం కూడా షురూ చేస్తారట. అటు సంతోష్‌ శోభన్‌కు కానీ, ఇటు శివానీకి కానీ ఇటీవల కాలంలో సరైన విజయాలు లేవు. ఈ సమయంలో పెద్ద సినిమాలతో పోటీ అంటే సాహసం అనే చెప్పాలి. అయితే పెద్ద ఎత్తున కాకుండా.. ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ అనే పేరు తెచ్చుకుని కుటుంబ ప్రేక్షకుల ఆదరణ పొందాలని చూస్తున్నారట.

మరి వీరి ఆలోచన ఏమవుతుందో చూడాలి. అన్నట్లు మొన్నీ మధ్య వరకు కామ్‌గా ఉన్న అజిత్‌ ‘తునివు’ ను జనవరి 11న తీసుకొస్తారని సమాచారం. అందరి కంటే ముందే వచ్చి ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి.. సినిమాకు భారీ ఓపెనింగ్స్‌ సంపాదించాలని అనుకుంటున్నారట. తద్వారా తెలుగు స్టార్లు వచ్చేలోపు అజిత్‌ సినిమాకు ఓపెనింగ్స్‌తో లాభాలు కొట్టేయాలని ఇక్కడ రిలీజ్‌ చేస్తున్నవాళ్ల ప్లాన్‌.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus