క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్ చేసిన వరుణ్ తేజ్ బ్యూటీ
October 5, 2018 / 01:45 PM IST
|Follow Us
క్యాస్టింగ్ కౌచ్ అంశంపై రోజుకో నటి స్పందిస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ లో ఈ విషయంపై చర్చ ఎక్కువగా జరుగుతోంది. గతంలో హీరోయిన్ తను శ్రీ దత్తాకి జరిగిన విషయాన్ని బయటపెట్టి.. లైంగిక దాడికి పాల్పడ్డ నానా పటేకర్ కి లీగల్ నోటీసులు పంపించింది. ఆమెకు అనేకమంది బాలీవుడ్ తారలు సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా వరుణ్ తేజ్ సినిమా “తొలిప్రేమ” లో నటించిన సప్నా పబ్బి మద్దతు పలికింది. బాలీవుడ్ లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని వాటిని సహించకూడదని తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. తనకు జరిగిన అవమానాన్ని బయటపెట్టింది. “ఓ చిత్ర షూటింగ్ లో ఆ దర్శకనిర్మాతలు ఇబ్బంది పెట్టారు.
షూటింగ్ కోసం అసౌకర్యంగా ఉన్న బిగుతైన బికినీ వేసుకోమన్నారు. ఆ బికినీ ధరించిన కొద్ది సేపటికి ఎద భాగంలో నొప్పి వచ్చింది. ఆ బికినీ మార్చాలని దర్శకుడిని ఎన్నిసార్లు అడిగినా….స్పందించలేదు. పైగా వెకిలిగా నవ్వాడు. స్టయిలిస్ట్ కూడా నా బాధని అర్ధం చేసుకోకుండా అతడితో కలసి నవ్వింది. ఆ సమయంలో నేను ఎంతో బాధపడ్డాను. నాకు అవకాశాలు రావేమోనని ఈ విషయం ఎక్కడా చెప్పలేదు” అని పోస్ట్ చేసింది. ఆమె మాటలు ప్రస్తుతం బాలీవుడ్ సినీ పరిశ్రమలో మహిళా టెక్నీషియన్స్, ఆర్టిస్టులను ఆలోచనలో పడేసింది. ఈ వేధింపులకు సరైన పరిష్కార మార్గాన్ని ఎంచుకోవాలని చర్చించుకుంటున్నారు.