కామెడియన్స్ గా ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు హీరోలవుదామని ప్రయత్నించి దెబ్బ తిన్న వాళ్ళలో సప్తగిరి కూడా ఒకడు. “ప్రేమకథా చిత్రమ్” తర్వాత మోస్ట్ వాంటెడ్ కమెడియన్ అయిపోయిన సప్తగిరి అనంతరం వరుస సినిమాల్లో నటించాడు. అయితే.. “సప్తగిరి ఎక్స్ ప్రెస్”తో కథానాయకుడిగా మారిన తర్వాత మాత్రం కమెడియన్ రోల్స్ తగ్గించేశాడు. దాంతో.. కథానాయకుడిగా విజయాలు లేక.. కమెడియన్ గా ఆఫర్లు లేక చాలా ఇబ్బందిపడాల్సిన పరిస్థితి వచ్చింది.
దాంతో.. తాను చేసిన తప్పును గ్రహించిన సప్తగిరి మళ్ళీ కమెడియన్ రోల్స్ ప్లే చేసేందుకు తాను సిద్ధమని తన మేనేజర్ ద్వారా దర్శకనిర్మాతలకు మెసేజులు పంపుతున్నాడట సప్తగిరి. మనోడు భారీగా ఆశలు పెట్టుకొన్న “వజ్ర కవచధర గోవింద” డిజాస్టర్ గా నిలవడం, ఆ సినిమా తర్వాత కథానాయకుడిగా అవకాశాలు, కమెడియన్ గా ఎంక్వైరీస్ రాకపోవడమే సప్తగిరి మైండ్ ఛేంజ్ అవ్వడానికి కారణం. మరి తప్పు తెలుసుకొని మళ్ళీ కమెడియన్ రోల్స్ కి ఒకే అన్న సప్తగిరిని మన దర్శకనిర్మాతలు పట్టించుకొంటారో లేదో చూడాలి.
బర్త్ డే స్పెషల్ : ప్రభాస్ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్…!
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?