Sapthagiri: సీనియర్ డైరెక్టర్ ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సప్తగిరి సినిమా..!

  • January 19, 2022 / 05:46 AM IST

ఓ పక్క స్టార్ కమెడియన్‌గా రాణిస్తూనే మరో పక్క హీరోగా కూడా ప్రేక్షకుల్ని పలకరిస్తూ వస్తున్నాడు సప్తగిరి. ఈ మధ్యనే ‘గూడుపుఠాణి’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సప్తగిరి తన నటనతో కొంతమేర ప్రేక్షకుల్ని అలరించాడు. ఇప్పుడు మరో చిత్రంలో కూడా హీరోగా నటించేందుకు సప్తగిరి సైన్ చేసాడు.విషయంలోకి వెళ్తే… ‘యజ్ఞం’, ‘పిల్లా… నువ్వు లేని జీవితం’ వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన దర్శకుడు ఎ.ఎస్. రవికుమార్ చౌదరి…

సప్తగిరిని హీరోగా పెట్టి ఓ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ‘రిగ్వేద క్రియేషన్స్’ బ్యానర్ పై ‘ప్రొడక్షన్ నంబర్ 1’ గా ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. ఎ.ఎస్. రిగ్వేద చౌదరి నిర్మించబోతున్న ఈ చిత్రం షూటింగ్ ను వచ్చే నెలలోనే ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు నిర్మాత. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందనున్న ఈ చిత్రం… సప్తగిరి నుండీ ప్రేక్షకులు ఆశించే.. ఫన్ తో నిండి ఉంటుందట.

ఈ విషయాన్ని నిర్మాత ఎ.ఎస్. రిగ్వేద చౌదరి చెప్పుకొచ్చారు. రవికుమార్ చౌదరి చాలా కసితో ఈ చిత్రం స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నారని కూడా ఆయన తెలిపారు. ఏమైనా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ ‘సప్తగిరి ఎల్ ఎల్ బి’ వంటి చిత్రాలతో మంచి కమర్షియల్ హిట్లు అందుకున్న సప్తగిరికి ఈ చిత్రం అతన్ని హీరోగా నిలబెట్టే బలాన్ని అందిస్తుందేమో చూడాలి..! సప్తగిరి సినిమాలకి నాన్ థియేట్రికల్ మార్కెట్ బాగా ఉంది.

దాదాపు అతని సినిమాలకి రూ.5 కోట్ల వరకు ఓటిటి రేటు పలుకుతుంది. ‘గూడుపుఠాణి’ చిత్రాన్ని కూడా ఓటిటి కోసమనే తెరకెక్కించి.. ఛాన్స్ ఉంది కదా అని థియేటర్లలో రిలీజ్ చేశారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus