ఎస్ఆర్ఆర్ బ్యానర్ లో సప్తగిరి హీరోగా కమర్షియల్ చిత్రం షూటింగ్ పూర్తి !!!

  • June 25, 2021 / 06:11 PM IST

ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మిస్తున్న చిత్రంలో సప్తగిరి హీరోగా నటిస్తున్నారు. సప్తగిరికి జోడీగా నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది.సంగీత దర్శకుడు రఘుకుంచె ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. కె. ఎం.కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

తన మొదటి సినిమాతో కుమార్ ఒక వైవిధ్యమైన కథను ఎంచుకోవడం జరిగింది. రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామి సంస్థగా పేరు పొందిన ఎస్ఆర్ఆర్ బ్యానర్ లో నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్ గా ఈ సినిమాను నిర్మించారు. హంపి, మైసూర్, మేల్కొటి, కంచి, చిక్మంగళూరు పరిసర అందమైన లొకేషన్స్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. త్వరలో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను మూవీ యూనిట్ విడుదల చేయనున్నారు.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus