1000 థియేటర్స్ లో ‘సరైనోడు’ టీజర్ విడుదల

  • February 26, 2016 / 05:54 PM IST

బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న యాక్షన్ చిత్రం ‘సరైనోడు’ టీజర్ ని ఫిబ్రవరి 18 న సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేసారు. సినిమా ఫస్ట్ లుక్ తోనే సినిమాపై హైప్ ని పెంచిన బన్నీ ఈ టీజర్ తో ప్రేక్షకులను మరోసారి అలరించబోతున్నాడు. యాక్షన్ సన్నివేశాలతో పాటు స్టైలిష్ లుక్, డైలాగ్స్ తో ఆకట్టుకోనున్నాడు. అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

బన్నీ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్న నిర్మాత అల్లు అరవింద్ సినిమా టీజర్ ని కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగుళూర్ తో కలిపి దాదాపుగా 1000 థియేటర్స్ లో ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఏప్రిల్ 8 న సినిమాని విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి ఒక ఐటెంసాంగ్ లో అల్లు అర్జున్ స్టెప్స్ వేయనుంది. ఇక బన్ని అభిమానులకి త్వరలోనే ఆడియో ఫంక్షన్ రూపం లో మరో సందడి ఉండనే ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus