Sarathkumar , Chiranjeevi: రాధిక భర్తకు చిరంజీవి చేసిన సాయం ఏంటో తెలుసా?
August 23, 2022 / 06:06 PM IST
|Follow Us
మెగాస్టార్ చిరంజీవి ఇతరులకు సహాయం చేసే విషయంలో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. చిరంజీవి తన సంపాదనలో కొంత మొత్తాన్ని సహాయ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే చేసిన సహాయాలను చెప్పుకోవడానికి చిరంజీవి అస్సలు ఇష్టపడరు. చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని ఆయనతో పని చేసిన వాళ్లు చెబుతారనే సంగతి తెలిసిందే. తన దగ్గర పని చేసేవాళ్లను సైతం చిరంజీవి ఎంతో బాగా చూసుకుంటారు.
ప్రముఖ నటుడు, రాధిక భర్త శరత్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. స్వయంకృషితో ఎదిగిన టాలీవుడ్ హీరోలలో చిరంజీవి కూడా ఒకరనే సంగతి తెలిసిందే. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శరత్ కుమార్ గతంలో వెల్లడించిన విషయాలకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో శరత్ కుమార్ నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఒక ప్రొడ్యూసర్ నా దగ్గరకు వచ్చి చిరంజీవితో ఒక సినిమా చేయడానికి డేట్లు ఇప్పిస్తే ఆ సినిమాకు వచ్చే లాభాలలో వాటా ఇస్తానని అన్నాడని చెప్పుకొచ్చారు.
చిరంజీవి ఒప్పుకుంటాడో లేదో అని సంకోచిస్తూనే నేను ఆయనను కలిశానని శరత్ కుమార్ చెప్పుకొచ్చారు. నేను అడిగిన వెంటనే చిరంజీవి ఒప్పుకోవడమే కాకుండా పారితోషికం కూడా తీసుకోలేదని శరత్ కుమార్ కామెంట్లు చేశారు. చిరంజీవి అంత మంచి స్నేహితుడు అని శరత్ కుమార్ చెప్పుకొచ్చారు. చిరంజీవితో కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించడం అదృష్టం అని శరత్ కుమార్ కామెంట్లు చేశారు.
ఆ వచ్చిన డబ్బుతోనే నేను నా అప్పులను తీర్చేశానని శరత్ కుమార్ కామెంట్లు చేశారు. చిరంజీవి గురించి గొప్పగా చెబుతూ శరత్ కుమార్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.