కార్తీ,షారుఖ్ ల సినిమాల కథలు ఒకటేనట.. క్లాస్ పీకిన ఎడిటర్..!
October 22, 2022 / 08:35 PM IST
|Follow Us
వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూనే దానికి కమర్షియల్ టచ్ ఉండేలా జాగ్రత్త పడుతుంటాడు కార్తి. అందుకే తమిళ హీరో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు కూడా ఇతన్ని బాగా ఓన్ చేసుకున్నారు. ఇతను నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్దార్’ నిన్న దీపావళి కానుకగా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు మంచి వసూళ్లను సాధించిన ఈ చిత్రం రెండో రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేస్తుంది అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఈ దీపావళికి ‘సర్దార్’ విన్నర్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా… కార్తీ నటించిన ‘సర్దార్’ కథ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తోన్న ‘జవాన్’ స్టోరీకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయట. ‘సర్దార్’ ను పి.ఎస్.మిత్రన్ డైరెక్ట్ చేశాడు. ఇక షారుఖ్ నటిస్తున్న ‘జవాన్’ కు అట్లీ దర్శకుడు. వీరిద్దరూ తమిళ దర్శకులే.,! ఈ రెండు కథలు ఒకటే అని అర్గ్యూ చేస్తున్నాడు ఓ ట్రేడ్ పండితుడు. అతనే క్రిస్టఫర్ కనగరాజ్.బాలీవుడ్ క్రిటిక్ కె.ఆర్.కె ట్వీట్ ను ఆధారం చేసుకుని అతను ఈ ఊహాగానాలు పోస్ట్ చేస్తున్నాడు.
అతని అనాలసిస్ ప్రకారం ” “కార్తీ #Sardar & అట్లీ #Jawan రెండు సినిమాల కథలు ఒకటేనట.నాన్న – రా ఏజెంట్, కొడుకు – పోలీస్ ఏజెంట్…. నాన్న ఒక మిషన్‌లో ఉన్నప్పుడు (విలన్ పాత్ర కారణంగా) వేరే ప్రదేశంలో/దేశంలో చిక్కుకొనిపోతాడు. కొన్నాళ్ల తర్వాత అతను విలన్‌పై పగ తీర్చుకోవడానికి వస్తాడు. అక్కడ తన కొడుకుని కలుస్తాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్.” అంటూ ఇతను సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. అయితే, షారుఖ్ ఖాన్ ‘జవాన్’, కార్తీ ‘సర్దార్’.. రెండింటికీ ఎడిటర్ ఒక్కరే.
అతని పేరు రూబెన్.క్రిస్టఫర్ కనగరాజ్ పోస్టుల పై అతను స్పందిస్తూ… “నేను స్కూల్లో చదువుతున్నప్పుడు , నేను నా స్నేహితులు ‘ రజనీకాంత్, విజయకాంత్ లు బ్రదర్స్ ‘అని అనుకొనేవాళ్లం, ‘కాంత్’ అని ఉండడం వల్ల. ఆ తర్వాత నేను ఎదిగాను.కానీ నా స్నేహితుల్లో చాలా మంది బాల్యం దగ్గరే ఉండిపోయారు. అక్కడ రా ఏజెంట్, ఇక్కడ రా ఏజెంట్ అయితే ఒక్కటే కథ అయిపోతుందా.? క్రిస్టఫర్ కనగరాజ్ పోస్టులు స్క్రీన్ షాట్ తీసుకుని ‘జవాన్’ రిలీజ్ అయ్యాక ఆ స్క్రీన్ షాట్స్ చూసి మళ్ళీ పోస్ట్ చేయండి” అంటూ అతను చెప్పుకొచ్చాడు.