Sardar Collection: 4వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘సర్దార్’..!

  • October 25, 2022 / 05:34 PM IST

కార్తి హీరోగా ‘అభిమన్యుడు’ ఫేమ్ పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సర్దార్’.ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది. రాశి ఖన్నా , రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో కింగ్ అక్కినేని నాగార్జున తన ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ద్వారా విడుదల చేశారు.మొదటి రోజు ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.

సినిమా చూసిన ప్రతి ఒక్కరూ టాక్ బాగానే చెప్పారు. దీంతో మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టింది.మొదటి రోజును మించి రెండో రోజు, రెండో రోజుని మించి మూడో రోజు కలెక్ట్ చేయడం విశేషం.ఇక 4వ రోజు దీపావళి హాలిడే కూడా ఈ మూవీకి బాగా కలిసొచ్చింది.ఒకసారి ‘సర్దార్’ 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 2.01 cr
సీడెడ్ 0.64 cr
ఉత్తరాంధ్ర 0.68 cr
ఈస్ట్+వెస్ట్ 0.43 cr
కృష్ణా + గుంటూరు 0.57 cr
నెల్లూరు 0.24 cr
ఏపి+ తెలంగాణ 4.57 cr

‘సర్దార్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.59 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.4.57 కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది. అయితే బ్రేక్ ఈవెన్ కు రూ.0.33 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

టాక్ పాజిటివ్ గా ఉండడంతో ‘కాంతారా’ వంటి చిత్రం పోటీగా ఉన్నప్పటికీ ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది. వీక్ డేస్ లో కూడా స్టడీగా రాణిస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేయడం గ్యారెంటీ అనే చెప్పాలి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus