Satyabhama Review in Telugu: సత్యభామ సినిమా రివ్యూ & రేటింగ్!
June 7, 2024 / 10:17 AM IST
|Follow Us
Cast & Crew
నవీన్ చంద్ర (Hero)
కాజల్ అగర్వాల్ (Heroine)
నేహా పఠాన్, ప్రజ్వల్ యడ్మ, సంపద ఎన్, అంకిత్ కొయ్య (Cast)
సుమన్ చిక్కాల (Director)
శ్రీనివాస్ రావు తక్కలపెల్లి - బాబీ తిక్క (Producer)
శ్రీచరణ్ పాకాల (Music)
విష్ణు బేసి (Cinematography)
సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal తన కెరీర్లో నటించిన మొట్టమొదటి ఫియల్ ఓరియెంటెడ్ మూవీ “సత్యభామ” (Satyabhama) . “గూఢచారి (Goodachari) , మేజర్ (Major) ” చిత్రాల దర్శకుడు శశికిరణ్ తిక్క (Sashi Kiran Tikka) ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏమేరకు అలరించింది? టైటిల్ పాత్రధారిణిగా కాజల్ అగర్వాల్ ఏస్థాయిలో ఆకట్టుకోగలిగింది? అనేది చూద్దాం..!!
కథ: మరో రెండు గంటల్లో పెళ్లి అనగా.. ఒక కేస్ ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ స్టేషన్ వచ్చిన సత్యభామ (కాజల్ అగర్వాల్)ను పోలీస్ స్టేషన్ లో కలుస్తుంది హసీనా (నేహా పఠాన్). ఆమె ప్రియుడు యేదు (అనిరుధ్ పవిత్రన్) తనను హింసిస్తున్నాడని, అతడి నుండి కాపాడమని వేడుకుంటుంది. స్త్రీ హింసను సీరియస్ గా తీసుకున్న సత్యభామ.. యేదుకు గట్టి వార్నింగ్ ఇస్తుంది.
కట్ చేస్తే.. హసీనాను దారుణంగా హత్య చేసి మాయమవుతాడు యేదు. అతడ్ని పట్టుకోవడంలో నిమగ్నమైన సత్యభామకు కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. ఆ కేస్ ఇన్వెస్టిగేషన్ లో అనుకోని విధంగా పొలిటీషియన్స్ & పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు.
అసలు యేదు ఎక్కడ దాక్కున్నాడు? ఎందుకని సత్యభామకు అతడ్ని పట్టుకోవడం అసాధ్యమైంది? హసీనా కథలో ఉన్నపళంగా అన్ని మలుపులు ఎందుకొచ్చాయి? వంటి ప్రశ్నలకు సమాధానమే “సత్యభామ” చిత్రం.
నటీనటుల పనితీరు: కాజల్ అగర్వాల్ తన కెరీర్లో మొట్టమొదటిసారి ఒక సీరియస్ పోలీస్ రోల్ చేసింది. ఇదివరకు పోలీస్ రోల్స్ లో కనిపించినా అవన్నీ కామెడీవే. ఈ చిత్రంలో సత్యభామగా ఆమె తెగువున్న పోలీస్ ఆఫీసర్ గా, స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ గా కనిపించిన విధానం బాగుంది. అయితే.. ఆమె సిన్సియర్ గా ఫైట్స్ చేసినా.. ఆమె ముఖంలోని సుకుమారం మాత్రమే కనిపించడంతో.. ఆ పోలీస్ క్యారెక్టర్ కి ఉన్న కసి ఆమెలో కనిపించలేదు.
హసీనాగా నటించిన నేహా పఠాన్ ది సినిమాలో కీలకపాత్ర అని చెప్పాలి. తిప్పికొడితే అయిదు డైలాగులు కూడా ఉండవు. కానీ.. సినిమా మొత్తం తన స్క్రీన్ ప్రెజన్స్ టు అలరించింది. ప్రజ్వల్ యడ్మ మరో కీలకపాత్రలో ఆశ్చర్యపరిచాడు. అనిరుధ్ పవిత్రన్, అంకిత్ కొయ్య (Ankith Koyya) , హర్షవర్ధన్ (Harsha Vardhan) తదితరులు కథాగమనానికి తమ పాత్రలతో న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: శ్రీచరణ్ పాకాల (Sricharan Pakala) తన నేపథ్య సంగీతంతో ప్రతి సన్నివేశాన్ని ఆసక్తికరంగా మార్చడానికి చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. విష్ణు సినిమాటోగ్రఫీ, పవన్ కల్యాణ్ (Kodati Pavan Kalyan)ఎడిటింగ్ వర్క్ కూడా సినిమాకి ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్టుమెంట్ సినిమాను రిచ్ గా చూపించడానికి కష్టపడ్డారు. దర్శకుడు సుమన్ చిక్కాల రాసుకున్న ములకథలో ఉన్న దమ్ము.. కథనంలో లోపించింది. అందువల్ల.. ఎంతో ఆసక్తికరంగా సాగాల్సిన కథనం, మధ్యలో ఎక్కడో తేడా కొట్టింది. నిజానికి థ్రిల్లర్ సినిమా స్క్రీన్ ప్లే అనేది నవారు మంచం అల్లినంత జాగ్రత్తగా, నేర్పుతో చేయాల్సిన పని.
అటువంటిది స్క్రీన్ ప్లే విషయంలో చేసిన కొన్ని ప్రయోగాలు, మెయిన్ ప్లాట్ ను సస్టైన్ చేయడం కోసం క్రియేట్ చేసిన సబ్ ప్లాట్స్ గట్రా.. ఎక్కువ స్పేస్ తీసుకొని మెయిన్ పాయింట్ & ట్విస్ట్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేయకుండా చేశాయి. అయితే.. థ్రిల్లింగ్ కిక్ ఇవ్వలేకపోయాడు కానీ.. ఓ మోస్తరుగా ఆకట్టుకోవడానికి ప్రయత్నించి.. కొంతమేరకు విజయం సాధించాడు సుమన్ చిక్కాల. ముఖ్యంగా దర్శకుడిగా కంటే కథకుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు.
విశ్లేషణ: ప్రస్తుత సమాజంలో స్త్రీల స్వయం సంరక్షణ ఎంత ముఖ్యం అనే విషయాన్ని నిర్లిప్తంగా చెబుతూనే.. మంచి ట్విస్టులతో ఆకట్టుకున్న చిత్రం “సత్యభామ”. కాజల్ అగర్వాల్ సీరియస్ పోలీస్ రోల్, శ్రీచరణ్ పాకాల సంగీతం, ఎంగేజ్ చేయడానికి ప్రయత్నించే ట్విస్టుల కోసం “సత్యభామ”ను చూడాల్సిందే!