Trivikram: మరోసారి త్రివిక్రమ్ ‘సెకండ్’ కాన్సెప్ట్ వైరల్… ఏ సినిమాలో ఎవరు ‘హర్ట్’ అయ్యారంటే?
May 20, 2024 / 12:25 PM IST
|Follow Us
త్రివిక్రమ్ (Trivikram) సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉండటం చాలా కామన్. దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో లేదు కానీ.. ఇప్పుడు అయితే ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అయితే రెండో హీరోయిన ఎందుకు ఉందో, ఏం చేస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఈ విషయంలో మీకేమైనా డౌట్ ఉంటే.. ఓసారి ఆయన సినిమాల లిస్ట్ చూసుకోండి. అందులో రెండో హీరోయిన్ పాత్ర ప్రాముఖ్యత చూడండి. మామూలుగా సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లకు ఒకేప్రాధాన్యం ఉండాలని అనుకోవడం, కోరుకోవడం సరికాదు కూడా. ఎందుకంటే అది అన్నిసార్లూ అసాధ్యం.
అయితే మరీ ఏదో సైడ్ యాక్టర్లా మారిస్తే ఎలా? ఈ మాట మేం అనడం లేదు. ఆయన సినిమాలు చూసినప్పుడల్లా ఈ మాట అభిమానులు, ప్రేక్షకులు అంటూనే ఉంటారు. తాజాగా ‘అరవిందసమేత’లో (Aravinda Sametha Veera Raghava) రెండో హీరోయిన్ (?) ఈషా రెబ్బా (Eesha Rebba) ఆ విషయం గురించి మాట్లాడటంతో చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఏ సినిమాలో ఎవరు ఇలా సెకండ్ హీరోయిన్గా వచ్చి, ఆ తర్వాత అడ్జెస్ట్ అయి హర్ట్ అయ్యారు అనే లెక్కలేస్తున్నారు నెటిజన్లు. వాళ్లు హర్ట్ అయ్యారని మీకెవరు చెప్పారు అని మీరు అడగొచ్చు.
ఆ సినిమా టైమ్‌లో వచ్చిన వార్తలు బట్టి చెబుతున్నాం అంతే. పవన్ కల్యాణ్ ‘జల్సా’ (Jalsa) సినిమాలో ఇలియానా (Ileana D’Cruz) మెయిన్ హీరోయిన్ కాగా, పార్వతి మెల్టన్ (Parvati Melton) సెకండ్. ఇక మూడో నాయికగా కమలినీ ముఖర్జీ (Kamalinee Mukherjee) కూడా ఉంది. అయితే పార్వతి, కమలినీ పాత్రలు చాలా తక్కువ ప్రాధాన్యత ఉన్నవే. ఇక ‘అత్తారింటికి దారేది’ (Attarintiki Daredi) సినిమాలో సమంత (Samantha Ruth Prabhu) , ప్రణీత (Pranitha Subhash) హీరోయిన్లే. అందులో ఎవరి ప్రాధాన్యత ఏంటో మీకు తెలుసు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (S/O Satyamurthy) సినిమాలో ఆదా శర్మ (Adah Sharma) పాత్ర మరీ జూనియర్ ఆర్టిస్ట్‌కి దగ్గరగా ఉందనే విమర్శలు వచ్చాయి.
‘అఆ’ (A Aa) సినిమాలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) పాత్రకు కూడా అంతే అని చెప్పాలి. ‘అరవింద సమేత’ గురించి ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం కూఆ. ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) సినిమాలో నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) పాత్ర, ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) క్యారెక్టరూ ఒకేలా ఉంటాయి. దీంతో ఏదో ఒక సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర అలా ప్రాధాన్యం లేకుండా ఉంది అంటే ఓకే.. చాలావరకు సినిమాలు అలానే ఉన్నాయి అంటే.. త్రివిక్రమ్ సెకండ్ హీరోయిన్ పాత్రలను అలానే రాస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నెటిజన్లు.