నిరాశలో పుట్టిన “అ” కథ!

  • February 6, 2018 / 02:33 PM IST

పెరిగిన వాతావరణం బట్టి రచయిత కలం నుంచి పన్నీరు వస్తుందా? కన్నీరు వస్తుందా? అనేది ఆధారపడి ఉంటుంది. అలా ఆలోచనతో పాటు అనుభవం తోడైతే ఆ కథ బాగుంటుంది. ఆలోచన, అనుభవానికి ఆవేదన కలిస్తే అద్భుతమైన కథ రెడీ అవుతుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. రిలీజ్ కి సిద్ధం అవుతున్న “అ” సినిమా కథ వెనుక ఇలాంటి సంఘటనే దాగుంది. ఈ విషయాన్నీ రచయిత, డైరక్టర్ రీసెంట్ గా వెల్లడించారు. “2016 డిసెంబర్ 31న నేను చేయాల్సిన ఒక సినిమా నిర్మాతలు వెనక్కి తగ్గడం వలన ఉన్నట్టుండి ఆగిపోయింది. ఆ విషయం తెలిసి ఆ రాత్రి పార్టీని కూడా క్యాన్సిల్ చేసి ఆ నిరాశలోనే ‘అ !’ రాయడం మొదలుపెట్టాను.

ఆ ఆవేదనలోంచి అద్భుతమైన కథ వచ్చింది. ఇది ఒక జాన్రాలో ఇమిడిపోయే కథ కాదు. ప్రతి పది నిముషాలకి ఓ మలుపు కథని మరో జాన్రాలోకి తీసుకు వెళుతుంది” అని వెల్లడించారు.  ఆ కథ నచ్చే  ఈ సినిమాని నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ బ్యానర్ లో నిర్మించారు. నిత్యామీనన్, కాజల్  అగ‌ర్వాల్‌వంటి స్టార్ హీరోయిన్స్ నటించడానికి ముందుకొచ్చారు. మాస్ మహారాజ్ రవితేజ కూడా వాయిస్ ఓవర్ చెప్పడానికి ఒకే చెప్పారు. వీరితో పాటు  శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు నటించిన ఈ చిత్రం ఈనెల 16 న రిలీజ్ కానుంది. ఆది నుంచి అంచనాలు పెంచుకుంటూ వస్తున్న ఈ మూవీ సంచలనం సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus